Moviesకెరీర్ లో ఏ హీరోయిన్ తో చేయని పని..వెంకటేష్ ఆమెతో చేసాడు..ఎందుకంటే..!?

కెరీర్ లో ఏ హీరోయిన్ తో చేయని పని..వెంకటేష్ ఆమెతో చేసాడు..ఎందుకంటే..!?

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న ఈ దగ్గుబాటి వారసుడు ఏ సినిమా చేసిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది. ఒకవేళ సినిమా కొంచెం టాక్ అటు ఇటు అయినా ఆయన పర్ఫామెన్స్ మాత్రం కేక పెట్టిస్తుంది. అలాంటి మార్కులు వేయించుకుంటాడు వెంకటేష్. మరీ ముఖ్యంగా వెంకటేష్ ఖాతాలో ఫ్యామిలీ డ్రామా సినిమాలో ఎక్కువగా ఉంటాయి.

ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే విధంగా హీరో సినిమాలు చేస్తాడని అందరూ అంటుంటారు . వెంకటేష్ తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్ లతో నటించాడు. మరి ముఖ్యంగా సౌందర్య-వెంకటేష్ కాంబో అంటే పడి చచ్చిపోతారు జనాలు. అయితే ఆ తర్వాత అంత బాగా ఆకట్టుకున్న జోడి ఏది అంటే వెంకటేష్-ఆర్తి అగర్వాల్. “నువ్వు నాకు నచ్చావ్”.. సినిమాలో ఈ జోడి ఎంత పాపులర్ అయిందో మనం చూసాం. అయితే కెరియర్ లో ఏ హీరోయిన్ తో చేయని పనిని వెంకటేష్ ఆర్తి అగర్వాల్ తో చేశాడట.

మనకు తెలిసిందే వెంకటేష్ ఆర్తి అగర్వాల్ నటించిన వసంతం సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. కమర్షియల్ గా పెద్దగా హిట్ కాలేకపోయినా.. టాక్ పరంగా పర్లేదనిపించింది. అయితే ఈ సినిమాల్లో వెంకటేష్-ఆర్తి అగర్వాల్ వైఫ్ అండ్ హస్బెండ్ గా కనిపిస్తారు. ఈ క్రమం లోనే ఓ సీన్లో వెంకటేష్ ఆర్తి అగర్వాల్ కి చీర కడతారు . నిజానికి అది నిజంగానే చేసారట. ఆర్తికి వెంకటేష్ నిజంగానే చీర కట్టారట. వెంకటేష్ ఇప్పటివరకు ఏ హీరోయిన్ కి ఇలా సారీ కట్టలేదట. ఫస్ట్ టైం ఆర్తి అగర్వాల్ కి మాత్రమే కట్టారట. అంతేకాదు అదే ఫస్ట్ అదే లాస్ట్ అయింది ఆయన కెరియర్లో. పాపం..స్టార్ గా బ్రతకాల్సిన ఆర్తి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news