Moviesమోహన్‌బాబు మొదటి భార్య విద్యా దేవి మరణం... నిర్మలాదేవితో పెళ్లి వెనక...

మోహన్‌బాబు మొదటి భార్య విద్యా దేవి మరణం… నిర్మలాదేవితో పెళ్లి వెనక ఎంత కథ జరిగిందా..!

టాలీవుడ్ లో సీనియర్ నటుడు మోహన్ బాబు రూటే సపరేటు. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడంలో ఆయనకు ఆయనే సాటి. చిత్తూరు జిల్లా ఏర్పేడుకు చెందిన మోహన్ బాబు సినిమాల్లోకి రాకముందు.. భక్తవత్సలం నాయుడు అనే పేరుతో అల్లరి చిల్లరగా తిరిగేవారు. మోహన్ బాబు తండ్రి ఉపాధ్యాయుడుగా పనిచేసేవారు. ఆయన సినిమాల్లో అవకాశాల కోసం చెన్నై వెళ్లి స్టూడియోల చుట్టూ తిరిగారు. ఆయన పేరు స్క్రీన్ మీద వేయాలనుకున్నప్పుడు ఈ పేరు కంటే మరో పేరు ఉంటే బాగుంటుందని అనుకున్నారు. దీంతో దర్శకరత్న దాసరి నారాయణరావు భక్తవత్సలం నాయుడు పేరును కాస్త మోహన్ బాబు గా మార్చారు.

ఇప్పుడంటే మోహన్ బాబు పై భారీ ఎత్తున ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఆయన స్వతహాగా మంచి నటుడు. ఎన్టీఆర్-ఏఎన్నార్ తర్వాత డైలాగులు చెప్పటంలో మోహన్ బాబుకు ఆయ‌నే సాటి అన్నంత పేరు ఉండేది. పైగా మంచి అభిరుచి కల నిర్మాత కూడా.. విలన్ గా, హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలో ఆయన నటించారు. విలన్ గా మోహన్‌బాబు నట విశ్వరూపం చూపించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

ఇదిలా ఉంటే మోహన్ బాబు వ్యక్తిగత జీవితంలో ఎవరికీ తెలియని విషయాలు కూడా ఉన్నాయి. మోహన్ బాబుకు ముందుగా విద్యా దేవితో వివాహం జరిగింది. వీరిద్దరి సంతానమే మంచు లక్ష్మి -మంచు విష్ణు. మోహన్ బాబు – విద్యాదేవి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. కెరీర్ ప్రారంభంలో మోహన్ బాబుకు సరిగా ఛాన్సులు లేనప్పుడు.. ఎన్ని కష్టాలు వచ్చినా విద్యాదేవి ఎంతో ధైర్యం చెప్పే వారట. ఒకరోజు మోహన్ బాబు ఇంటి అద్దె కట్టటం ఆలస్యం కావడంతో ఆ ఇంటి యజమాని వారు వంట వండుకునే పాత్రల్లో మూత్ర విసర్జన చేశాడట. ఆరోజు మోహన్ బాబు విద్యాదేవి ఇంట్లోకి వెళ్లి ఏడ్చారట. ఈ విషయాన్ని మోహన్ బాబు స్వయంగా చెప్పారు.

ఆ సమయంలో మోహన్ బాబు జీవితంలో ఎదగాలంటే మరింతగా కష్టపడాలని ఎక్కువ సినిమాల్లో నటించే వారట. అలా సినిమాల్లో బిజీ కావడంతో సమయానికి ఇంటికి వచ్చేవారు కాదట. దీంతో భార్య విద్యాదేవిని కూడా ఆయన సరిగా పట్టించుకునే వారు కాదు. పిల్లలను కూడా పట్టించుకునేందుకు ఆయనకు తీరిక ఉండేది కాదట. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో క్షణికావేశంలో విద్యాదేవి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ సమయంలో విష్ణు- లక్ష్మీ ఇద్దరూ కూడా చిన్న పిల్లలు.

వాళ్ళకు తల్లి లేని లోటు తీర్చాలని దాసరి నారాయణ రావు లాంటి పెద్దలు జోక్యం చేసుకొని విద్యాదేవి చెల్లి నిర్మలాదేవితో మోహన్ బాబుకు రెండో వివాహం జరిపించారు. వీరి తనయుడు మంచు మనోజ్. మోహన్ బాబు తన విద్యాసంస్థలన్నిటికీ మొదటి భార్య విద్యాదేవి పేరు పెట్టారు. ఇక నిర్మలాదేవి కూడా విష్ణు- లక్ష్మీ తన అక్క కుమార్తెలు అయినా ఆ బేధం లేకుండానే పెంచింది. మొదటిలో బాగా కోపిష్టి అయిన మోహన్ బాబుకు నిర్మలా దేవితో పెళ్లి అయ్యాక ఆ కోపం క్రమంగా తగ్గింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news