Moviesఆ స్టార్ క్రికెట‌ర్‌తో త‌మ‌న్నా ల‌వ్ ఎఫైర్...? ఆ ఫోటోలు బ‌య‌ట‌కు...

ఆ స్టార్ క్రికెట‌ర్‌తో త‌మ‌న్నా ల‌వ్ ఎఫైర్…? ఆ ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో అంతా షాక్..!

మిల్కీ బ్యూటీ తమన్నా అంటే టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. మంచు మ‌నోజ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన తమన్నా మొద‌టి సినిమాతోనే అభిమానులను సంపాదించుకుంది. ముట్టుకుంటే మాసిపోయే అందంతో తమన్నా ఎంతోమందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. తమన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అల్లు అర్జున్, రామ్ చరణ్ సైతం తమ ఫేవరెట్ హీరోయిన్ తమన్నా అని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

ఇక వరుస సూపర్ హిట్ ల‌ను అందుకుని తమన్నా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రాంచరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇలా స్టార్ హీరోలు అందరితోనూ జోడి కట్టింది. అయితే ఇటీవ‌ల కాలంలో తమన్నా క్రేజ్ తగ్గింది. దాంతో సీనియర్ హీరోలకు తమన్నా జోడిగా నటిస్తోంది. ఇటీవల వెంకటేష్ హీరోగా నటించిన ఎఫ్2, ఎఫ్3 సినిమాల్లో తమన్నా వెంకటేష్ కు జోడిగా నటించి నటనతో ఆకట్టుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం హీరోయిన్ గానే కాకుండా విభిన్న పాత్రల‌లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది.

నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించి అదరగొట్టింది. అయితే మిగతా హీరోలతో పోలిస్తే తమన్నా పై రూమర్స్ కాస్త తక్కువ అనే చెప్పాలి. కానీ తమన్నా కూడా అప్పట్లో పాక్ క్రికెటర్ తో లవ్ ఎఫైర్ నడిపిస్తుందని టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అలా వార్తలు రావడానికి కూడా ఒక కారణం ఉంది. పాకిస్తాన్ క్రికెటర్ తో తమన్నా దిగిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చెక్క‌ర్లు కొట్టాయి. ఆ పాకిస్తాన్ క్రికెటర్ మరెవరో కాదు అబ్దుల్ రజాక్.

వీరిద్దరూ కలిసి దుబాయ్‌లో ఓ జ్యువెల‌రీ షాప్ ఓపెనింగ్ లో కనిపించారు. దాంతో తమన్నా అబ్దుల్ రజాక్ ప్రేమలో ఉన్నారు అంటూ ప్రచారం జరిగింది. ఈ ఫోటోలకు సంబంధించి అబ్దుల్ రజాక్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. తాము ఓ షాప్ ఓపెనింగ్ లో భాగంగా మాత్రమే ఫోటోలు దిగామని చెప్పారు. దాంతో తమన్నా పాకిస్తాన్ క్రికెటర్ తో లవ్ ఎఫైర్ లో ఉందని వస్తున్న వార్తలకు చెక్ పడింది. ఇదిలా ఉండగా తమన్నా ఎలాంటి రూమ‌ర్ల‌ను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది ప్రస్తుతం తమన్నా గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news