Moviesఈరోజు అక్కినేని అభిమానులకు మర్చిపోలేని దినం..ఎందుకో తెలుసా..!?

ఈరోజు అక్కినేని అభిమానులకు మర్చిపోలేని దినం..ఎందుకో తెలుసా..!?

జనరల్ గా లైఫ్ లో ఏ మంచి జరిగినా చెడు జరిగిన ఆ రోజున చాలామంది గుర్తుపెట్టుకుంటూ ఉంటారు . పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు ,ప్రపోజల్ డే కావచ్చు.. వాళ్ళ లైఫ్ లో ఇంపార్టెంట్ వ్యక్తులను కలిసిన రోజు కావచ్చు.. అలాంటి రోజులు మర్చిపోలేని విధంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే జీవితంలో కొన్ని కొన్ని రోజులు మనం మరిచిపోవాలనుకున్న మరిచిపోలేం . అవి మిగిల్చే చేదు జ్ఞాపకాలను బాధను సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇంకా పెంచేస్తున్నారు జనాలు. ప్రస్తుతం అదే బాధను అనుభవిస్తున్నారు అక్కినేని నాగచైతన్య అలాగే హీరోయిన్ సమంత.


మనకు తెలిసిందే. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి “ఏ మాయ చేసావే” సినిమా చేస్తున్న టైంలోనే ఒకరినొకరు అర్థం చేసుకుని మనసులు కలిసాయి. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లయితే అయింది కానీ పట్టుమంటే పది కాలాలు కూడా కలిసి లేరు. పెళ్లైన నాలుగో ఏడాదికి విడాకులు తీసుకొని వేరువేరుగా బ్రతకడానికి నిర్ణయించుకున్నారు. సరిగ్గా సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించి ఈరోజుకి సంవత్సరం కావస్తుంది. ఆ చేదు జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా కొందరు జనాలు ట్రోల్ చేస్తున్నారు. మీరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని సంవత్సరమైందని.. ఇప్పటికీ మీకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయని ..ఇప్పటికైనా మీరు నోరు విప్పి ఎందుకు విడాకులు తీసుకున్నారు చెప్పాలని ..అది అభిమానులుగా మా డిమాండ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు .

అయితే అటు సమంత కాని ఇటు నాగచైతన్య కానీ ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ గా స్పందించలేదు. దీంతో ఈరోజు నీ సమంత నాగచైతన్య ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారో తెలియదు కానీ అక్కినేని అభిమానులు మాత్రం ఈరోజు గుర్తుపెట్టుకున్నారు. అందుకే #CHAYSAMDIVORCE ని ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. కొందరైతే ఈరోజు నిజంగా అక్కినేని నాగచైతన్యకు మరో పుట్టినరోజు అని.. సమంత పీడ పోయిందని అంటుంటే,, సమంత ఫ్యాన్స్ కూడా మా సమంత కూడా అదృష్టవంతురాలు అందుకే అక్కినేని ఇంటి నుంచి బయటకు వచ్చేసిందని.. ఒకరిపై ఒకరు నిందించుకుంటున్నారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో సమంత నాగచైతన్య పేర్లు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news