Movies‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా కోసం ఐశ్వర్య రాయ్ కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్..అయ్య...

‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా కోసం ఐశ్వర్య రాయ్ కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్..అయ్య బాబోయ్..అన్ని కోట్లా..!?

“పోనియన్ సెల్వన్ పార్ట్ 1 “రెండు రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ సంపాదించుకున్న సినిమా ఇది. నిజానికి ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు కథ వేరేలా ఉండింది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో సినిమా పై బోలెడన్ని అంచనాలు పెట్టుకొని ఉన్నారు జనాలు. తనదైన స్టైల్ లో ఓ చారిత్రాత్మక సినిమాను తెరకెక్కించి మంచి మార్కులు వేయించుకున్నాడు. నిజానికి ఓ చారిత్రాత్మక సినిమా తెరకెక్కించడం అంటే మాటలు కాదు . దానికి ఎంతో హార్డ్ వర్క్ ఉండాలి. స్టోరీ బ్యాక్ గ్రౌండ్, ఆర్ట్ వర్క్, డిజైన్స్, కాస్ట్యూమ్స్ అన్ని పక్క ప్లానింగ్ తోనే చేయగలగాలి. ఏదో కథ రాసుకున్నామో సినిమా తెరకెక్కించామా రిలీజ్ చేశామా ఇలా అనుకుంటే సరిపోదు.

పైగా ఇది రాజుల నాటి కథ ఖచ్చితంగా దీనిపై ఎంతో స్టడీ చేసి ఉండాలి. పైగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో జనాలు సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకోనిఉన్నారు. పైగా భారీ తారగాణం దీంతో ఆటోమేటిక్ గా తమిళ్ ప్రజలు ఈ సినిమాను ఓ రేంజ్ లో హైప్ ఇచ్చారు. అంతేకాదు ఏకంగా ఈ సినిమాని ఇండియన్ సినిమాను రికార్డు కొల్లగొట్టిన బాహుబలి తో కంపేర్ చేశారు. తమిళ్ బాహుబలి అంటూ ఓ రేంజ్ లో ప్రచారం చేసుకున్నారు. కానీ సినిమా మొదటి బొమ్మ పడగానే సీన్ రివర్స్ అయింది . బాహుబలి అంత సినిమా అని చెప్పలేము కానీ ఒకసారి చూడొచ్చు . కాగా అది కూడా స్టోరీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు.. రాజుల కథలంటే ఇష్టం లేని వాళ్ళు సినిమాకి వెళ్తే తలనొప్పి తప్ప ఏమీ రాదు అంటూ చెప్పుకొచ్చిన జనాలు ఉన్నారు.

కాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఈ సినిమాలో తనదైన స్టైల్ లో నటించి ఐశ్వర్య రాయ్ మంచి మార్కులు వేయించుకుంది .సినిమా మొత్తానికి నడనపరంగా మెప్పించిన నటులు త్రిష , ఐశ్వర్యారాయ్ అంటూ సినిమా చూసిన జనాలు చెప్పుకొస్తున్నారు . భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా కోసం ఐశ్వర్యరాయ్ తీసుకున్న పారితోషకం ఇప్పుడు సోషల్ మీడియాలో యమ ట్రెండింగా మారింది.

ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఈ చిత్రాన్ని తమిళ్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఐశ్వర్య తీసుకున్న రెమ్యూనరేషన్ షాకింగ్ గా ఉంది అంటున్నారు జనాలు. అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ అందాల సుందరి ఐశ్వర్యరాయ్ ఈ సినిమా కోసం ఏకంగా 15 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమా కోసం స్పెషల్గా డిజైన్ చేయించుకున్న దుస్తులను కూడా ఆమెకు నచ్చినవి మణిరత్నం దగ్గర నుంచి ఫ్రీగానే తీసుకునిందట. దీంతో సినిమాలో మిగతా హీరోయిన్లతో కంపేర్ చేస్తే ఐశ్వర్యారాయ్ టాప్ ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news