Moviesఆదిపురుష్ ట్రోల్స్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. ఏం కవర్ చేసారు...

ఆదిపురుష్ ట్రోల్స్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. ఏం కవర్ చేసారు సార్..!?

పాన్ ఇండియా స్టార్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. బాహుబలి సినిమాతో తన క్రేజ్ ను డబుల్ చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఒక్క హిట్టు కొట్టలేక అల్లాడిపోతున్నాడు . బాహుబలి తర్వాత వచ్చిన సాహో డిజాస్టర్ గానే మిగిలింది . సహో తర్వాత వచ్చిన రాధే శ్యామ్ డిజాస్టర్ గానే మిగిలింది. దీంతో ప్రభాస్ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆది పురుష్ సినిమా సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది . అయితే ఈసారి ఎలాగైనా సరే ఆది పురుష్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.


కేవలం ప్రభాసే కాదు ఆయన అభిమానులు కూడా ఈసారి ఎలాగైనా సరే ప్రభాస్ హిట్ కొట్టాలి అంటూ గట్టిగా దేవుడిని వేడుకుంటున్నారు . అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ఆదిపురుష్.. టీజర్ చూసిన జనాలకు ఆ ఆశలు కూడా లేవు . ఎందుకంటే టీజర్ పరమ చెత్తగా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేనా ఎప్పుడు లేని విధంగా ఆది పురుష్ సినిమాని బాయి కాట్ చేయండి అంటూ ట్రెండ్ చేస్తున్నారు జనాలు.దానికి ముఖ్య కారణం డైరెక్టర్ ఓం రావత్ చేసిన చెత్త పని. ఈ సినిమా కోసం విజువల్ ఎఫెక్ట్స్ యానిమేషన్స్ పరమ చెత్తగా క్రియేట్ చేసుకుని తన పరువు తీసుకోవడమే కాకుండా ప్రభాస్ పరువును కూడా మీడియా ముందు సోషల్ మీడియాలో అడ్డంగా తీసేసాడు .

దీంతో ఆది పురుష టీజర్ ను ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో మనకు తెలిసిందే. అయితే ఈ ట్రోల్స్ పై ఆది పురుష్ డైరెక్టర్ ఓం రావత్ స్పందించాడు. తనదైన స్టైల్ లో ట్రోలింగ్ ని కవర్ చేసే విధంగా చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ..”ఆది పురుష్ టీజర్ పై జరుగుతున్న ట్రోలింగ్ నేను ఊహించింది. కాకపోతే మరి ఈ రేంజ్ లో జరుగుతుందని అనుకోలేదు . దాంతో కొంచెం ధైర్యం కోల్పోయాను . అయినా కానీ నేను బాధపడట్లేదు. ఆది పురుష్ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని మెప్పిస్తుంది. వెండితెరపై మరో కొత్త చరిత్ర సృష్టించబోతుంది అనడంలో సందేహం లేదు. బిగ్ స్క్రీన్ పై మీకు వి ఎఫ్ ఎక్స్ , యానిమేషన్ సీన్స్ అద్భుతంగా కనిపిస్తాయి. మరి ముఖ్యంగా ఈ సినిమా ద్వారా ప్రభాస్ తనలోని కొత్త నటుడిని ప్రూవ్ చేసుకుంటాడు. మారుమూల ప్రాంతంలో ఉండే వాళ్ళను కూడా థియేటర్లకు రప్పించాలనే ఉద్దేశంతోనే మేము ఈ సినిమాని ఇలా తెరకెక్కించాం”అంటూ ట్రోలింగ్ ను కవర్ చేసుకోవచ్చాడు. దీంతో మరోసారి తన మాటలకు ట్రోల్ అవుతున్నాడు ఓం రావత్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news