Moviesవామ్మో: అప్ప‌టి హాట్ భామ‌ మనీషా కొయిరాలా ఇంత మందితో అఫైర్స్...

వామ్మో: అప్ప‌టి హాట్ భామ‌ మనీషా కొయిరాలా ఇంత మందితో అఫైర్స్ సాగించిందా ?

నేపాల్ దేశస్తురాలైన మనిషా కొయిరాలా మొదట్లో నేపాల్ ఫిలిమ్స్ లోనే నటించేది. ఆ తరువాత ఇండియా సినిమాల్లో నటించడం మొదలుపెట్టి హిందీతో పాటు తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కొన్ని ఇంగ్లీష్ సినిమాలు కూడా నటించింది. నేపాల్ దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి కొయిరాలా కుటుంబంలో జన్మించిన మనీషా 1991 లో తన మొదటి హిందీ సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన తోటి నటుడు వివేక్ ముష్రాన్ తో ప్రేమలో పడింది. ఇక్కడి నుంచి మొదలు తన జీవితమంతా కూడా ఆ ప్రేమ కోసం పరితపిస్తూనే ఉంది. ఆమె జీవితంలో ఎంతోమందికి స్థానం ఉంది. పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకున్నా కూడా ప్రేమకు మాత్రం కొదవే లేదనట్టుగా నేటి వరకు జీవిస్తుంది. మరి ఆమె జీవితంలో ఎంత మందితో ప్రేమలో పడిందో చూస్తే షాకే..!

 

వివేక్ ముష్రాన్ :
1991లో తొలిసారిగా సౌధాగర్ అనే హిందీ సినిమాలో నటించిన మనిషా కొయిరాలా తన కో స్టార్ వివేక్ ముష్రాన్‌తో ప్రేమలో పడింది. వెంటనే బ్రేకప్ కూడా చెప్పేసింది.

క్రిస్పొన్ కన్రాయ్ :
ఈ నేపాలి బ్యూటీ ఆస్ట్రేలియన్ అంబాసిడర్ అయిన క్రిస్పోన్ కాన్రాయ్ తో పీకల్లోతు ప్రేమలో మునిగింది. 2000 సంవత్సరంలో ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఆ టైంలో మనీషా పెళ్లికి సిద్ధంగా లేకపోవడంతో ఈ ప్రేమ బ్రేకప్ అయింది.

నానా పాటేకర్ :
ఇక క్రిస్పోన్ తో బ్రేకప్ కాగానే నానా పాటేకర్‌తో ప్రేమలో పడింది. అగ్నిసాక్షి సినిమాలో నటిస్తున్న సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే నానా పాటేకర్ భార్యతో విడాకులు తీసుకొని తన కోసం వస్తాడు అని ఎదురుచూసినా.. అది జరగకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్ళింది.

హూసనే :
పాటేకర్ తో బ్రేకప్ తర్వాత ఎమోషనల్ గా డిప్రెషన్ లో ఉన్న మనీషా హూసనే తో ప్రేమలో పడింది అయితే ఈసారి హూసనే పెళ్లికి సిద్ధంగా ఉన్న మనీషా మాత్రం అందుకు సిద్ధంగా లేదు అందుకే బ్రేకప్ జరిగింది.

సిసిల్ :
ఇక 2003లో మనీషా ఫిలిం మేకింగ్ చదువుకోవడానికి లండన్ వెళ్ల‌గా అక్కడ సిసిల్ తో ప్రేమలో పడింది. ఇతడు లండన్లో ఉన్న నైజీరియన్ బిజినెస్ మాన్. అయితే వీరు కూడా పెళ్లి చేసుకోవాలని భావించినా కొన్ని కార‌ణాల వ‌ల్ల బ్రేక‌ప్ అయ్యింది.

ఆర్యన్ వైడ్ :
ఇక సీ గ్రేడ్ ఫిలిమ్స్ చేసే ఆర్యన్ తో ప్రేమలో పడింది మనిషా. అయితే అతడు పబ్లిక్ లో మనీషాతో పెళ్లి గురించి మాట్లాడంతో ఆమె అతడిని దూరం పెట్టింది.

ప్రశాంత్ చౌదరి :
ఇక మరోసారి మనిషా ప్రశాంత్ చౌదరి అనే వ్యక్తితో ప్రేమలో పడింది. వీరి పెళ్లికి ప్రశాంత్ కుటుంబం ఒప్పుకోవడంతో ఒప్పుకోకపోవడంతో వీరికి కూడా బ్రేకప్ జరిగింది.

అక్షయ్ :
ఆస్ట్రేలియాలో ఉండే ఇండియన్ దేశస్థుడైన అక్షయ్ అనే వ్యక్తితో ఈసారి ప్రేమలో పడిన మనిషా అక్షయ్ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది కానీ అందుకు అక్షయ్ సిద్ధంగా లేకపోవడంతో వీరి బ్రేకప్ జరిగింది.

సందీప్ చౌతా :
మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతాతో ప్రేమలో పడిన మనిషా కొయిరాలా ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్ అక్షయ్ కోసం అతడి నుంచి విడిపోయింది .

క్రిస్టోఫర్ డోరిస్ :
ఇక క్రిస్టోఫర్ తో చాలా రోజుల పాటు రిలేషన్ కొనసాగించిన మనీషా సామ్రాట్ దహల్ తో పెళ్ళి కోసం ఇతడికి బ్రేకప్ చెప్పింది.

సామ్రాట్ దహాల్ :
ఫైనల్లీ 2012 లో సామ్రాట్‌తో ఫేస్బుక్ లో పరిచయం చేసుకొని పెళ్లి చేసుకోగా రెండేళ్లకే విడాకులు ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news