Moviesకలర్స్ స్వాతీని DSP అంత టార్చర్ చేసాడా..? మెసేజ్స్ తో విసిగించాడా..తెర...

కలర్స్ స్వాతీని DSP అంత టార్చర్ చేసాడా..? మెసేజ్స్ తో విసిగించాడా..తెర పైకి సంచలన మ్యాటర్..!!

స్వాతి ఇలా చెప్తే తెలుగు జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు.. అదే కలర్స్ స్వాతి అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా తను కెరియర్ ను స్టార్ట్ చేసిన షో తో పాపులారిటీ సంపాదించుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ . తన పదహారేళ్ల వయసులో కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకరింగ్ చేసి జనాలకు దగ్గరైన స్వాతి ..కలర్స్ ప్రోగ్రాంలో ఆమె యాక్టింగ్.. ఆమె స్పాంటేనియస్ డైలాగ్స్.. ఆమె చిరునవ్వు చూసి దర్శక నిర్మాతలు ఫ్లాట్ అయ్యి,, సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆమె డేంజర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది . అంతేకాదు ఆ తర్వాత బోలెడు సినిమాలో నటించిన స్వాతి హిట్లు ఫ్లాపులు అని సంబంధం లేకుండా జనాల ను తన నటన తో మెప్పించింది.

స్వాతి కేవలం నటే కాదు మంచి సింగర్ . పాటలు బాగా పాడుతుంది . అయితే సినిమాలో పాటలు పాడడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ కలర్స్ స్వాతిలో ఉన్న టాలెంట్ను గుర్తించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ..ఆమెను ఓ సినిమాలో పాట పాడడానికి ఫోర్స్ చేశాడట . నిజానికి కలర్స్ స్వాతి డిఎస్పి చెప్పినా కానీ పాటలు పాడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట . కానీ ఆమెకు పదేపదే ఫోన్ చేస్తూ మెసేజ్ చేస్తూ విసిగించేసాడట .

అంతేకాదు ఆమె పాట పాడమని ఏకంగా ఇంటికి వెళ్లి పేరెంట్స్ కి చెప్పి ఫోర్స్ చేశారట. దీంతో ఆ బాధను భరించలేక కలర్స్ స్వాతి.. డిఎస్పీ కోసం పాట పాడడానికి సిద్ధపడిందట. ఇంతకీ కలర్స్ స్వాతి పాడిన పాట ఎంటో తెలుసా.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో నాగచైతన్య హీరోగా తమన్న హీరోయిన్గా నటించిన 100% లవ్ సినిమాలో …ఏ స్క్వేర్ బి స్క్వేర్ ..అనే పాట ఫిమేల్ వర్షన్ పాడింది కలర్ స్వాతి. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఈ సినిమాలో ఈ పాట హైలైట్ గా నిలిచింది . ఇక తర్వాత కలర్స్ స్వాతి తనదైన స్టైల్ లో కొన్ని సినిమాల్లో నటించి ప్రేమించి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది .ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news