Moviesయస్..అది నిజమే..బిగ్ బాంబ్ పేల్చిన రాజమౌళి..ఫ్యాన్స్ షాక్..!!

యస్..అది నిజమే..బిగ్ బాంబ్ పేల్చిన రాజమౌళి..ఫ్యాన్స్ షాక్..!!

“సర్కారు వారి పాట” సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ..ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఎస్ ఎస్ ఎన్ బి 28 అనే సినిమాలో నటిస్తున్నాడు . ఎప్పుడో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే ప్రారంభమైంది . అయితే కొన్ని అనివార్య కారణాల చేత షూటింగ్ వాయిదా పడింది. మళ్లీ షూటింగ్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే మహేష్ బాబు గారు వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో సినిమా షూటింగ్ పూర్తిగా ఆపేశారు.

అంతేకాదు ప్రజెంట్ మహేష్ బాబు విదేశాలకు వెళ్లినట్టు సమాచారం . అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ రెండవ వారంలో త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా షూటింగ్ యధావిధిగా కొనసాగనున్నట్లు తెలుస్తుంది . కాగా డిసెంబర్ ఆఖరి వారం కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి జనవరి రెండో వారంలో మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారట. మనకు తెలిసిందే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో సినిమా అయిపోయిన వెంటనే దర్శకధీరుడు రాజమౌళితో మరో సినిమా కమిట్ అయ్యాడు . ఎవ్వరు ఊహించని కని విని రేంజ్ లో మహేష్ బాబు ఈ సినిమాలో కనిపించబోతున్నాడని రాజమౌళి ఎప్పుడో చెప్పేసాడు.

 

కాగా విజయేంద్రప్రసాద్ కూడా ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులను పూర్తి చేసినట్లు సమాచారం . అయితే తాజాగా సినీ వర్గాల నుంచి అందుతున్న న్యూస్ ప్రకారం రాజమౌళి-మహేష్ బాబు సినిమా రియల్ ఇన్సిడెంట్ కదా ఆధారంగా తెరకెక్కిబోతున్నట్లు తెలుస్తుంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. నిజంగానే అక్కడ జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని విజయేంద్రప్రసాద్ కథను రాసుకున్నాడట.

అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు ఫిజికల్ గా చాలా స్టంట్స్ చేస్తారని ..ఇప్పటివరకు మహేష్ బాబు ఎవ్వరు చూడని రోల్ లో ఆయనని రాజమౌళి చూపించబోతున్నాడని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఫిజికల్ గా డిమాండింగ్ అవుతుందని ..ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్ లో కనిపించనున్నాడని ..అందుకు సంబంధించిన పనులను రాజమౌళి ఫైనల్ చేస్తున్నారని..విజయేంద్రప్రసాద్ క్లారిటీనిచ్చాడు. అంతే కాదు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం చేయడానికి రాజమౌళి పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. ఏదేమైనా సరే రాజమౌళి రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా సినిమా తీయబోతున్నాడు అంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అభిమానులకి. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో.. సీన్ ఊహించుకుంటుంటేనే ఓ రేంజ్ హ్యాపీగా అనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news