Moviesఎన్టీఆర్ అంటే ఆ హీరోయిన్‌ మ‌ర‌ద‌లు పిల్ల ప‌డిచ‌చ్చేదా...!

ఎన్టీఆర్ అంటే ఆ హీరోయిన్‌ మ‌ర‌ద‌లు పిల్ల ప‌డిచ‌చ్చేదా…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఫుల్‌స్వింగ్‌లో ఉన్నాడు. త్రిబుల్ ఆర్ పాన్ ఇండియా రేంజ్‌లో హిట్‌. అస‌లు టెంప‌ర్ నుంచి వ‌రుస‌గా ఆరు సినిమాలు సూప‌ర్ హిట్లు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోవ‌డంతో వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలే ఒప్పుకుంటున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లోనే స్టూడెంట్ నెంబ‌ర్ 1 – ఆది – సింహాద్రి లాంటి సూప‌ర్ హిట్ల‌తో ఎన్టీఆర్ టాప్ స్టార్ అయిపోయాడు.

ఎన్టీఆర్ కెరీర్‌లో ఫ‌స్ట్ హిట్ స్టూడెంట్ నెంబ‌ర్ 1. ఈ సినిమాతోనే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. గ‌జాలా ఎన్టీఆర్‌కు జోడీగా హీరోయిన్‌గా న‌టించింది. ఆ సినిమాలో వీరిద్ద‌రి ఫెయిర్ సూప‌ర్ అంటూ ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత మ‌రోసారి గ‌జాలా – ఎన్టీఆర్ క‌లిసి అల్ల‌రి రాముడు సినిమాలోనూ జోడీ క‌ట్టారు. ఈ సినిమాలో గ‌జాలా ఎన్టీఆర్‌కు మ‌ర‌ద‌లిగా న‌టించింది.

అయితే ఈ రెండు సినిమాల్లోనూ ఎన్టీఆర్‌ను ఆన్‌స్క్రీన్‌లో ప్రేమించిన గ‌జాలా… ఆఫ్ స్క్రీన్‌లోనూ తార‌క్‌ను వ‌న్‌సైడ్‌ ల‌వ్ చేసింద‌న్న పుకార్లు కూడా వ‌చ్చాయి. అప్పుడు తార‌క్ నూనుగు మీసాల‌తో ఉండేవాడు. తార‌క్ వ‌య‌స్సు కూడా 20 ఏళ్లు దాట‌లేదు. ఆ టైంలో ఎన్టీఆర్‌కు వ‌చ్చిన క్రేజ్ చూసి గ‌జాలా రియ‌ల్‌గా ప్రేమించింద‌ట‌. అయితే అదంతా ఆమె వైపు నుంచే జ‌రిగింది.

తార‌క్‌కు చెప్పినా న‌వ్వి లైట్ తీస్కొన్నాడ‌ని అంటారు. ఆ త‌ర్వాత మ‌రోసారి ఎన్టీఆర్‌, గ‌జాలా కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా వారి కాంబోలో ఓ సినిమా సెట్ చేయాల‌ని ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు చేసినా వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌కు ఏ హీరోయిన్‌తోనూ లింకులు ఉన్నాయ‌న్న వార్త‌లు రాలేదు కాని.. ఒక్క స‌మీరారెడ్డి విష‌యంలో మాత్రం ఈ రూమ‌ర్ వ‌చ్చింది.

ఎన్టీఆర్ స‌మీరాతో అశోక్‌, న‌ర‌సింహుడు లాంటి రెండు సినిమాలు చేశాడు. ఇందులో అశోక్ కోసం ఎన్టీఆరే స్వ‌యంగా సమీరాను రిక‌మెండ్ చేశాడ‌న్న పుకార్లు రావ‌డంతోనే కొన్ని సందేహాలు వ‌చ్చాయి. అయితే స‌మీరాతో ఎన్టీఆర్ చేసిన రెండు సినిమాలు క‌లిసి రాలేదు. రెండూ ప్లాప్ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news