Movies"నువ్వు పొట్టి దానివి..ఆ పని ఎలా చేస్తావ్"..?..దారుణంగా అవమానించిన స్టార్ ప్రొడ్యూసర్..!?

“నువ్వు పొట్టి దానివి..ఆ పని ఎలా చేస్తావ్”..?..దారుణంగా అవమానించిన స్టార్ ప్రొడ్యూసర్..!?

సినీ ఇండస్ట్రీలో కి హీరోయిన్ గా, హీరోగా అడుగుపెట్టాక కచ్చితంగా మనం కొన్ని కొన్ని అలవాట్లను మార్చుకోవాలి . మరీ ముఖ్యంగా మనపై వేలెత్తి చూపించే జనాలు ఎక్కువమంది ఉంటారు. తప్పుచేసిన తప్పు చేయకపోయిన నిందించే మనుషులు బోలెడు మంది. ఇలా ప్రతి వారితో మనం తిట్టుకుంటూ పోలేం. ప్రతి వారితో వాదించుకుంటూ లైఫ్ లో గడవలు పడి బ్రతకలేం. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలోకి సెలబ్రిటీలుగా వచ్చిన తర్వాత ఎవరైనా సరే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి అలా కంట్రోల్ చేసుకున్న వాళ్లే హీరోయిన్గా హీరోలుగా మంచి అవకాశాలు దక్కించుకుంటారు. అలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్న నటి నివేదా థామస్.

నివేదా థామస్ ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు .మలయాళం, తమిళ, తెలుగు సినిమాలలో బోలెడు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న అల్లరి పిల్ల. ఎస్ హీరోయిన్ అనడం కన్నా నివేదా థామస్ ని ఓ అల్లరి పిల్ల పక్కింటి అమ్మాయి మన చెల్లి అనడం చాలా బాగా ఉంటుంది. అలానే ఆమె సినిమాలో కనిపిస్తుంది. నేను హీరోయిన్ రేంజ్ లోనే సినిమాలు చేస్తాను అని ఏనాడు ఆమె గిరి గీసి పెట్టుకోలేదు. నా మనసుకు నచ్చి.. నాకు ఎంజాయ్ చేసే పాత్రలు ఏవైనా సరే ఆఖరికి చెల్లి పాత్రైనా సరే చేయడానికి రెడీ అంటూ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే .

అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలా ఉండాలో మనకు తెలిసిందే. అందాలని కప్పుకొని దాచుకొని ఉండే హీరోయిన్స్ కన్నా విప్పుకొని చూపించే హీరోయిన్స్ కి ప్రాముఖ్యత ఇస్తున్నారు మన దర్శక నిర్మాతలు . ఆ లిస్ట్ లో చూసుకుంటే నివేదా ధామస్ ఎప్పుడూ లాస్ట్ లోనే ఉంటుంది . ఇప్పటివరకు వల్గర్ మాటలు వల్గర్ రోల్స్ ఎక్స్పోజింగ్ చేసిన దాఖలాలు లేవు నివేదా థామస్ ఖాతాలో. దీంతో అమ్మడును దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకోరు. అయితే సినీ కెరియర్ స్టార్టింగ్ లో నివేదా థామస్ తో మన తెలుగు ప్రొడ్యూసర్ చాలా చెత్తగా మాట్లాడినట్టు తెలుస్తుంది .

మనకు తెలిసిందే నివేదా థామస్ కొంచెం పొట్టిగా ఉంటుంది . దీన్నే పాయింట్ అవుట్ చేస్తూ ఆయన ఓ బడా హీరో సినిమాలో డైరెక్టర్ అవకాశం ఇచ్చిన సదరు ప్రొడ్యూసర్ ఆమెను కించపరిచేలా మాట్లాడారట. ఆమెను ఈ సినిమా నుంచి తప్పించేలా చేశాడట . “నువ్వు పొట్టిగా ఉన్నావ్ ..మరి హీరోతో డాన్స్ ఎలా వేస్తావ్ ..”అంటూ కావాలని ఆమెను తక్కువగా చేసి డైరెక్టర్ కు చెప్పి ఈ సినిమా నుంచి ఆమెను తీయించేసారట. స్టార్టింగ్ లో ఇలాంటి బ్యాక్ స్టెప్ పడడం నివేదాకు మింగుడు పడలేదట . ఇక తర్వాత మెల్ల మెల్లగా తన నేచురల్ యాక్టింగ్ తో ఆమె టాప్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయింది. ప్రస్తుతం నివేదా థామస్ పలు తెలుగు ,మలయాళం చిత్రాలతో బిజీగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news