Moviesపేరంట్స్ కోసం అనుపమ షాకింగ్ నిర్ణయం..అభిమానులు కన్నీళ్లు..!?

పేరంట్స్ కోసం అనుపమ షాకింగ్ నిర్ణయం..అభిమానులు కన్నీళ్లు..!?

ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ నవ్వాలో ఏడవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు . ఎస్ నిజమే తండ్రి మాట విని తల్లిదండ్రులను సంతోషపెడుతున్న అమ్మాయిగా హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేక అభిమానులకు ఇకపై దూరం కాబోతుందని బాధపడాలో తెలియక అయోమయంలో ఉన్నారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అభిమానులు. ఎస్ రీసెంట్గా అందుతున్న సమాచారం ప్రకారం అనుపమ పరమేశ్వరన్ తన తల్లిదండ్రుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.


గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకున్న అను త్వరలోనే పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేయబోతుంది అంటూ ఓ రేంజ్ లో సినీవర్గాల నుంచి సమాచారం వైరల్ గా మారింది. అయితే తాజాగా సన్నిహితులు దగ్గర నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇకపై అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమాలకు సైన్ చేయదట . ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను మాత్రం బ్రేక్ పడకుండా యధావిధిగా షూటింగ్ కంప్లీట్ చేసి.. ఆ తరువాత తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుందట.

ఇదే న్యూస్ టాప్ ట్రెండింగ్ లోకి దూసుకుపోతుంది .అనుపమ పరమేశ్వరణ్ ఎంత అందగత్తో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు మలయాళ బ్యూటీనే అయినా చూడడానికి చాలా చక్కగా తెలుగు అమ్మాయిలా ఉంటుంది. చీర కట్టుకొని నుదుటి కుంకుమ పెట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని చేతికి గాజులు నగలతో అలంకరించుకుంటే అచ్చం కుందనపు బొమ్మలానే ఉంటుంది. ఇంత అందగత్తకు మన దర్శక నిర్మాతలు ఎందుకు మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు ఇవ్వలేకపోయారో ఆ దేవుడికే తెలియాలి.

కాగా రీసెంట్గా మాత్రం చందు మొండేటి ఆమెలోని నటన గుర్తించి కార్తికేయ 2 లో మంచి రోల్ ఇచ్చారు. అనుకున్న దానికి డబుల్ పర్ఫామెన్స్ క్రియేట్ చేసి అనుపమ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . అయితే ఈ సినిమాతో తన జాతకం తిరిగి పోయిందని ఇక అన్ని పాన్ ఇండియా రేంజ్ సినిమాలే చేస్తుందని అనుకున్నారు అభిమానులు. అయితే తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేని కారణంగా అనుపమ పరమేశ్వరణ్ త్వరగా పెళ్లి చేసుకొని వాళ్ళ ఆఖరి కోరిక తీర్చాలని నిర్ణయించుకుందట. ఈ క్రమంలోనే ఆమె కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదంటూ తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news