Movies"ప్లీజ్ ఆ మాటలను ఎడిటింగ్ లో తీసేయ్యండి"..అందరి ముందు నోరు జారిన...

“ప్లీజ్ ఆ మాటలను ఎడిటింగ్ లో తీసేయ్యండి”..అందరి ముందు నోరు జారిన సుకుమార్..!!

అబ్బా తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ, డైరెక్టర్ సుకుమార్ అనుకోకుండా టంగ్ స్లిప్ అయ్యి బన్నీ అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చాడు. ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండిగా మారింది. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది. ఆర్య 1, ఆర్య 2 , పుష్ప వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా రీసెంట్గా వచ్చిన పుష్ప అయితే బ్లాక్ బస్టర్ హిట్ ని.. బన్నీ ఖాతాలో పడేలా చేసింది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ మూవీ అభిమానులకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. అంతేకాదు విమర్శకులు సైతం ఇందులో బన్నీ నటనను చూసి శభాష్ అంటూ మెచ్చుకున్నారు.

మరికొన్ని రోజుల్లో పుష్ప 2 సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ క్రమంలోనే ఓ హైలెట్ టాప్ సీక్రెట్ ను టక్కున చెప్పేసాడు సుకుమార్. ” అయ్యయ్యో సారీ ఈ మాటలు రికార్డ్ చేయొద్దు ప్లీజ్ ఎడిటింగ్ లో తీసేయండి “అంటూ మీడియాకు రిక్వెస్ట్ చేశారు. కానీ అప్పటికే సుకుమార్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో యమ వైరల్ గా మారాయి . అసలు విషయం ఏమిటంటే..

పుష్ప2ని పాన్ ఇండియా రేంజ్ లు తర్కెక్కిస్తున్న సుకుమార్ అండ్ టీం.. ఈ సినిమాను ఫారెన్ కంట్రీస్ లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ ప్రకటన అయితే లేదు . వాళ్ళు వీళ్ళు చెప్పడమే తప్పిస్తే సుకుమార్ కానీ ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ గా స్పందించింది లేదు . కానీ ఫర్ ది ఫస్ట్ టైం మీడియా ముందు సుకుమార్ టక్కున టంగ్ స్లిప్ అయిపోయాడు. రష్యాలో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం అంటూ పొరపాటున టంగ్ స్లిప్ అయిపోయాడు.

ఓ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన సుకుమార్ అక్కడే ఓ రష్యన్ అమ్మాయితో మాట్లాడాడు..ఆమె తన అభిమానిని అని చెప్పడంతో ఉప్పొంగిపోయిన సుకుమార్ ఈ టాప్ సీక్రెట్ ను బయట పెట్టేసాడు. దీంతో ఈ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారిపోయింది. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అంతటి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కేవలం ఒక అభిమాని కోసం ఇంతటిటాప్ సీక్రెట్ ను లీక్ చేస్తాడా..? లేదా ఇదేమైనా పుష్ప2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ డ్రామానా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఏది ఏమైనా తాజాగా వచ్చిన అప్డేట్ తో బన్నీ అభిమానులు అయితే ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. మరి చూడాలి పుష్ప2 ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news