Moviesతప్పు అని తెలుసు కానీ తప్పలేదు..ఆ నొప్పి నాకు ఎంతో సంతృప్తిని...

తప్పు అని తెలుసు కానీ తప్పలేదు..ఆ నొప్పి నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది..!!

సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావడం పెద్ద గొప్ప విషయం కాదు. వచ్చిన తర్వాత మంచి మంచి అవకాశాలను దక్కించుకుని స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అవ్వడం.. ఆ తర్వాత ఆ పేరుని 10 కాలాలపాటు చెరగనీకుండా చూసుకోవడమే నిజమైన హీరోయిన్ల లక్షణం. ప్రజెంట్ దానికోసమే ట్రై చేస్తుంది అందాల బ్యూటీ సోనాలి చౌహన్ . అమ్మడు పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు లెజెండ్ సినిమాతో తనదైన స్టైల్ లో గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ త్వరలోనే “ఘోస్ట్” సినిమాతో మనల్ని మెప్పించడానికి మన ముందుకు రాబోతుంది.

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా “ఘ్ఫ్స్ట్” ఈ సినిమాలో సోనాలి చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటిస్తుంది. కాగా త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోనాలి చౌహాన్ ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అంతేకాదు “ఘోస్ట్” సినిమా ఆఫర్ ఎలా వచ్చింది.. ఈ సినిమా కోసం ఆమె ఎంత కష్టపడింది అనే విషయం చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేసింది.

సోనాలి చౌహాన్ మాట్లాడుతూ ..”నాకు హీరోయిన్ కన్నా కూడా గ్లామరస్ పాత్రల కన్నా కూడా యాక్షన్ పాత్రలు చేయాలన్నది నా కల .ఘోస్ట్ సినిమాతో అది నెరవేరింది అనుకుంటున్నాను. హీరోయిన్ అంటే కేవలం గ్లామరస్ పాత్రలే కాదు ఎలాంటి రోల్స్ నైనా చేయగలగాలి. మరీ ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ఆడవాళ్లు చేయలేరు అనుకుంటారు . కానీ అది అబద్ధం హీరోయిన్ ..అంటే అన్ని రోల్స్ చేయగలగాలి అదే నేను నమ్ముతాను. అప్పుడే మనం జనాల్లోకి వెళ్ళగలం ఈ సినిమాలో నా పాత్ర చాలా సరికొత్తగా ఉంటుంది. ఓ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నేను మీకు కనిపిస్తాను. నిజానికి ఈ పాత్ర కోసం నేను చాలా వ్యాయామాలు చేశాను. వర్కౌట్స్ చేశాను. స్టంట్స్ చేశాను. ఆ టైంలో నా బాడీ సహకరించక చాలా నొప్పిని భరించింది. కానీ నాకు ఇష్టమైన యాక్షన్ సీన్స్ చేయడానికి ఆ నొప్పిని ఎంతో భరించాను ..ఆ నొప్పి నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది .యాక్షన్స్ సీన్స్ ఉన్నాయని చెప్పడంతో ఈ సినిమా స్క్రిప్ట్ వినగానే ఒప్పేసుకున్నాను . ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది సోనాలి చౌహాన్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news