Moviesఆ వ్య‌క్తి వ‌ల్లే రోజా స్టార్ హీరోయిన్ గా అయ్యిందా..? ఎవ్వరికీ...

ఆ వ్య‌క్తి వ‌ల్లే రోజా స్టార్ హీరోయిన్ గా అయ్యిందా..? ఎవ్వరికీ తెలియ‌ని నిజాలు ఇవే..?

శ్రీలత రెడ్డి ఈ పేరు చెప్తే బహుశా ఎక్కువమందికి తెలియదేమో.. అదే రోజా అంటే తెలుగు జనాలు చాలా సింపుల్ గా గుర్తుపట్టేస్తారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రోజా పాతుకు పోయింది. కెరీర్ ఆరంభంలో చిన్నాచితకా పాత్రలు వేసుకుంటూ హీరోయిన్‌గా నిల‌దొక్కుకున్న రోజా.. ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ కొన్ని ఏళ్లపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది.

ఆ తర్వాత రాజకీయాలకు వచ్చి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. రోజా `గోలీమార్` సినిమాలో ఏకంగా ప్రియమణికి అమ్మగా… గోపీచంద్ కు అత్తగా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత బుల్లితెరపై జడ్జిగా ఎంట్రీ ఇచ్చిన రోజా తెలుగు బుల్లితెర రంగంలో మంచి డిమాండ్ ఉన్న యాంక‌ర్‌గా దూసుకుపోయింది. అసలు `జబర్దస్త్` షోకు అంత క్రేజ్ రావడానికి రోజా పాత్ర చాలా ఉందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల నుంచి బుల్లితెర.. బుల్లితెర నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా ఏకంగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ప్రస్తుతం మంత్రిగా కూడా కొనసాగుతున్నారు.

ఒక సాధారణ హీరోయిన్ నుంచి కెరీర్ ప్రారంభించిన రోజా ఈరోజు ఏకంగా రాజకీయాల్లో రాణించడంతోపాటు మంత్రి స్థాయికి ఎదిగారు. 50 ఏళ్లకు దగ్గరైన రోజా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీగా తన అందాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కోలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు సెల్వమణిని రోజా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఓ పాప‌, బాబు ఉన్నారు. రోజా పుట్టిన కొద్ది రోజులకే ఆమె కుటుంబం హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. అయితే రోజా మాత్రం తన డిగ్రీని తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో పూర్తి చేశారు.

ఆమె హీరోయిన్ అవ్వకముందు కూచిపూడి డ్యాన్సర్ గా ఎన్నో ప్రదర్శనలు చేశారు. ఇక రోజా ఈ రోజు స్టార్ హీరోయిన్ గా.. మంత్రిగా.. ఇంత క్రేజ్ తెచ్చుకోవటం వెనక ఓ వ్యక్తి ఉన్నారు. ఆయనే రోజా తన గురువుగా భావిస్తూ ఉంటారు. ఆయన ఎవరో కాదు దివంగత మాజీ నటుడు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే ఎన్ శివప్రసాద్. రోజా హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా `ప్రేమ తప్పస్సు` ఆ సినిమాకు శివప్రసాద్ దర్శకుడు. అయితే ఆమె సినీ ప్రయాణం `సర్పయాగం` సినిమాతో మొదలైంది.

అయితే రోజాలోని టాలెంట్ను గుర్తించి ఆమెను ముందుగా ప్రోత్సహించింది మాత్రం శివప్రసాద్. అందుకే వీరిద్దరూ వేరు వేరు పార్టీల‌లో ఉన్నా కూడా శివప్రసాద్ అంటే రోజాకు ఎంతో గౌరవం ఉండేది. అయితే రోజాకు 1992లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన `సీతారత్నం గారి అబ్బాయి` సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పటినుంచి ఆమె వెనక్కు తిరిగి చూసుకోలేదు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news