Moviesఆ హీరోయిన్‌ కెరీర్‌పై నాని అంత దెబ్బ కొట్టాడా...!

ఆ హీరోయిన్‌ కెరీర్‌పై నాని అంత దెబ్బ కొట్టాడా…!

బాలీవుడ్‌లో నటించిన వారు టాలీవుడ్‌కు టాలీవుడ్‌లో నటించిన వారు బాలీవుడ్‌కి వెళ్ళడం ష‌రా మామూలే. అయితే, అక్కడ..ఇక్కడ సక్సెస్ అయ్యేవారు చాలా తక్కువమంది. మరీ ముఖ్యంగా కొందరు హీరోల సరసన నటిస్తే ఆ హీరోయిన్ కెరీర్ ఇక అంతే అనేట్టుగా ఉంటుంది పరిస్థితి. అలాంటి సెంటిమెంట్ మన టాలీవుడ్ మినిమం గ్యారెంటీ హీరో నేచురల్ స్టార్ నాని విషయంలో కూడా వినిపిస్తుంది. నాని సరసన హీరోయిన్‌గా నటిస్తే అందరూ సక్సెస్ కారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అలాంటి వారిలో ఇప్పటివరకు చాలామంది పేర్లు ఉన్నాయి. ఆ లిస్ట్‌లో హాట్ బ్యూటీ వాణి కపూర్ కూడా ఉన్నారు. వాణి కపూర్ హిందీలో శుద్ధ్ దేశీ రొమాన్స్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో మంచి హాట్ పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌కి చమటలు పట్టించింది. రొమాంటిక్ సీన్స్‌లో అదరగొట్టి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత బేఫిక్రే సినిమాలో హద్దులేవీ పెట్టుకోకుండా నటించింది. ఘాటు రొమాన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో వాణీ కపూర్ బాలీవుడ్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్.

ఇదే హాట్ బ్యూటీ తెలుగులో నాని హీరోగా నటించిన ఆహా కళ్యాణం సినిమాలో హీరోయిన్‌గా నటించింది. బివి నందిని రెడ్డి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా వాణీ కపూర్ మొదటి తెలుగు సినిమా. మనకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. తెలుగు టైటిల్ ..ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఖచ్చితంగా టాలీవుడ్‌లో మంచి కమర్షియల్ హీరోయిన్‌గా నిలబడతానని వాణీ చాలా నమ్మకాలు పెట్టుకొని ఇక్కడ దిగింది. కానీ, ఆహా కళ్యాణం ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. నానికి లిప్ కిస్ కూడా ఇచ్చింది. ఇది కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

అయితే, నాని వల్ల వాణీకి ఇక్కడ కలిసి రాలేదు. సినిమా డిజాస్టర్ కావడంతో మళ్ళీ అమ్మడికి తెలుగు తెరపై కనిపించే ఛాన్స్ దక్కించుకోలేపోయింది. మన మేకర్స్‌కి ఉన్న సెంటిమెంట్ ప్రకారం మొదటి సినిమా ఫ్లాపైతే ఆ హీరోయిన్‌ను పక్కన పెట్టేస్తారు. వాణి విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు కేవలం అందాల ఆరబోస్తూ ఫొటో షూట్స్ మాత్రమే చేస్తోంది. హిందీలో కూడా పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. అయితే వాణీ మంచి పర్ఫార్మర్. మంచి కథ ఉన్న సినిమా పడితే గ్యారెంటీగా మళ్ళీ ఫాంలోకి వచ్చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news