Movies"వాడు నన్ను పక్కలోకి రమ్మన్నాడు"..బిగ్ బాంబ్ పేల్చిన యాంకర్ విష్ణుప్రియ..!!

“వాడు నన్ను పక్కలోకి రమ్మన్నాడు”..బిగ్ బాంబ్ పేల్చిన యాంకర్ విష్ణుప్రియ..!!

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం. ఈ మధ్యకాలంలో ఈ క్యాస్టింగ్ కౌచ్ పదం మనం ఎక్కువగా వింటున్నాం. అఫ్ కోర్స్ ఒకప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఉండేది.. కానీ ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ధైర్యం చేసి మరి మమ్మల్ని పలానా డైరెక్టర్ ..పలానా ప్రొడ్యూసర్ పక్కలోకి రమ్మన్నాడు ..వాళ్ళ కోరికలు తీర్చమన్నారు అంటూ ధైర్యంగా డైరెక్టర్ , ప్రొడ్యూసర్ పేర్లు కూడా చెబుతున్నారు . అలా చెప్పినా కానీ సినీ ఇండస్ట్రీలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం వాళ్ళకి లేకుండా పోయింది. ఇప్పటికే అలా చెప్పిన హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా పక్కన పడిపోయారు.. ఇండస్ట్రీలో లేరు.


కాగా రీసెంట్ గా బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ కూడా అదే లిస్టులోకి చేరింది. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు బుల్లితెరపై కూడా అలాంటివి జరుగుతున్నాయి అంటూ బిగ్ బాంబ్ పేల్చింది. విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు “పోవే పోరా” అనే షో తో బాగా పాపులారిటీ సంపాదించుకొని ..తనదైన స్టైల్ లో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కొన్ని సినిమాల్లో కూడా నటించింది. నిజానికి అమ్మడు వెండి తెర కన్నా బుల్లితెరపైనే బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈ భామ ఇంస్టాగ్రామ్ వేదికగా ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఓ రేంజ్ లో ఫాలోవర్స్ ని సంపాదించుకుంటూ వస్తుంది.

రీసెంట్ గా ఈ బ్యూటీ”జరీ జరీ” అంటూ సాగే ఓ వీడియో సాంగ్ కూడా చేసిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ లో విష్ణుప్రియ హాట్ గా ఉందని కుర్రకారు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సాంగ్ ప్రమోషన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు ప్రియ మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ..”సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న మాట సత్యం. అది అందరికీ తెలిసినది.

నన్ను కూడా సినిమా అవకాశాల పేరుతో వాడుకోవాలని చూశాడు ఓ బడా డైరెక్టర్. సినిమా అవకాశం ఇస్తాం అంటూ తన కెరియర్ మొదట్లో ఓ డైరెక్టర్ తనతో మిస్ బీహేవ్ చేయడానికి ట్రై చేశాడని ..”సినిమాలో ఛాన్స్ ఇస్తాం మరి నా కోరిక తీరుస్తావా” అంటూ డైరెక్టర్ డైరెక్ట్ గా అడిగేసారని.. కానీ తనకు అలాంటి చెత్త పనులు చేసి అవకాశాలు దక్కించుకునే కర్మ పట్టలేదని ..ఆమె ముఖానే చెప్పేసినట్లు చెప్పుకొచ్చింది. దీంతో విష్ణు ప్రియ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు కొందరు నెటిజన్స్ “నిజంగానే విష్ణు ప్రియ డైరెక్టర్ కు కమిట్మెంట్ ఇవ్వలేదా ..?”అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి ఆన్సర్ విష్ణుప్రియ ఏం చెప్తుందో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news