Moviesవాళ్లు పైట జారితే సోల్లు కార్చేస్తారు.. క‌రాటే క‌ళ్యాణి బోల్డ్ కామెంట్స్..!

వాళ్లు పైట జారితే సోల్లు కార్చేస్తారు.. క‌రాటే క‌ళ్యాణి బోల్డ్ కామెంట్స్..!

టాలీవుడ్ లోని క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో కరాటే కళ్యాణి కూడా ఒకరు. వ్యాంప్ క్యారెక్టర్ల‌తో కరాటే కళ్యాణి ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమాలో బ్రహ్మానందంతో కలిసి బాబీ అంటూ ఓ సీన్ లో నటించగా ఆ సీన్ కు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ఈ సినిమాతో పాటు కరాటే కల్యాణి చాలా సినిమాల్లో అలాంటి పాత్రలే చేసింది. శంకర్ దాదా ఎంబీబీఎస్, ఛత్రపతి సినిమాల్లో కూడా నటించింది. నిజానికి కరాటే కల్యాణి హరి కథలు చెబుతూ అంచెలు అంచెలుగా ఎదిగి ఇండస్ట్రీ లో నటిగా ఎదిగింది.

136 గంటల పాటు హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా హరి కథ చెప్పి లిమ్కా బుక్ ఆఫ్ గున్నిస్ రికార్డు దక్కించుకుంది. ఆమో స్వ‌స్థ‌లం విజ‌య‌న‌గ‌రం జిల్లా. ఆమె కుటుంబం హ‌రిక‌థ‌లు చెప్పేది. అలా తండ్రి వార‌స‌త్వాన్ని అంది పుచ్చుకుని క‌ళ్యాణి కూడా హ‌రిక‌థ‌లు చెప్పేది. అయితే ఆమెకు వ్య‌క్తిగ‌త జీవితం క‌లిసి రాలేదు. ఆమె ప్రేమించినోడు.. పెళ్లి చేసుకున్నోడు కూడా త‌న‌ను మోసం చేశార‌ని ఎన్నోసార్లు వాపోయింది.

ఇక క‌ల్యాణి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి కూడా చాలా మంది అభిమానులను అలరించింది. ఇదిలా ఉంటే కరాటే కల్యాణి సామాజిక రాజకీయ అంశాల పై తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటుంది. అంతే కాకుండా ప్రస్తుతం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది. బిజెపిలో చేరిన కరాటే కల్యాణి ఆ పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడే వాళ్ల పై నిప్పులు చెరుగుతూ ఉంటుంది. ఇక చెప్పేవి నీతులు చేసేవి బూతు పాత్రలు అని విమర్శలు రావడంతో గత కొద్ది రోజులుగా వ్యాంప్ పాత్రలకు కూడా కరాటే కల్యాణి గుడ్ బై చెప్పేసి కేవలం రాజకీయాల్లో కొనసాగుతోంది.

 

అంతే కాకుండా కొన్ని ఇంటర్వ్యూ లలో తాను పూర్తిగా సినిమా లకు కూడా గుడ్ బై చెబుతా అంటూ వ్యాఖ్యానించింది. అంతే కాకుండా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… సంచలన కామెంట్స్ చేసింది. కరాటే. హరికథలు, పురాణాలు చెబితే రాని గుర్తింపు తనకు వ్యాంప్ పాత్రల ద్వారా వచ్చినట్టు తెలిపింది. సినిమాల్లోకి వచ్చి తాను పైట జారిస్తే మాత్రం ప్రేక్షకులు ఆదరించారు అని పేర్కొంది. ఇప్పటికీ తాను ఏ షో కు వెళ్ళినా బాబీ అంటూ పిలుస్తారని చెప్పింది. తనను గుర్తు పట్టినందుకు సంతోష‌పడాలో లేదంటే.. త‌న‌కు వ‌చ్చిన క్రేజ్‌ వ్యాంప్ పాత్రల వల్ల వచ్చింద‌ని బాధ పడాలో అర్థం కాదని ఆవేదన వ్యక్తం చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news