Moviesతరుణ్ ఆఫర్ ని దొబ్బేసిన వెంకటేష్.. హీట్ పుట్టిస్తున్న సినీ సీక్రేట్స్..!?

తరుణ్ ఆఫర్ ని దొబ్బేసిన వెంకటేష్.. హీట్ పుట్టిస్తున్న సినీ సీక్రేట్స్..!?

ఎస్ ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వెంకటేష్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన నువ్వు నాకు నచ్చావ్ మూవీ ని నిజానికి చేయాల్సింది యంగ్ హీరో తరుణ్ అట. కానీ ఆ సినిమాను తరుణ్ దగ్గర నుంచి వెంకటేష్ లాక్కున్నారు అంటూ ఓ వార్త సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఎంత మంచి విజయం అందుకుందో . కే విజయభాస్కర్ డైరెక్షన్లో త్రివిక్రమ్ రైటింగ్ ఈ సినిమాకు ప్లస్ గా మారింది . అంతేకాదు ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కోటి గారి మ్యూజిక్.

ఎంత అద్భుతంగా ఉంటాయో పాటలు. ఇప్పటికీ వినాలి అనిపిస్తుంటుంది .ఎన్నిసార్లు విన్నా సరే బోర్ కొట్టవు. ఇక డైలాగ్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఇప్పటికి మన రెగ్యులర్ జీవితంలో ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్స్ ఖచ్చితంగా వాడుతుంటాం. మరీ ముఖ్యంగా ..”నువ్వు ఏమవుతావ్ రా అని ఎవరైనా అడిగినప్పుడు ..ఐఏఎస్.. ఐపీఎస్ ఇలాంటివి కాకుండా ఏదైనా”.. అనే డైలాగ్ మన జీవితంలో ఖచ్చితంగా వాడు ఉంటాం గుర్తు చేసుకోండి.

కాగా అప్పట్లోనే సెన్సేషనల్ విజయం సాధించిన నువ్వు నాకు నచ్చావ్ మూవీ కి మొదట హీరోగా అనుకున్నింది తరుణ్ నట. హీరోయిన్ కూడా ఆర్తి అగర్వాల్ కాదట గజాల అని అనుకున్నారట . కానీ ఈ సినిమా స్టోరీ వినగానే ఇండస్ట్రీకి సంబంధించిన ఓ పెద్దాయన దగ్గుబాటి కుర్రాడికి ఈ స్టోరీ బాగుంటుందని చెప్పి మొత్తం.. ఆయన అనుకున్న నటీనటులు అందర్నీ మార్చేసి సినిమాను మరో అద్భుతంగా తీర్చిదిద్దారట . అలా ఈ ప్రాజెక్టు తరుణ్ చేతిలో నుంచి చేజారిపోయి వెంకీ ఖాతాలో పడింది . దీంతో వెంకీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి పడింది. కాగా ప్రస్తుతం వెంకటేష్ సెకండ్ ఇన్నింగ్స్ లో చేతికి వచ్చిన సినిమాలలో నచ్చిన సినిమాలు చేస్తుంటే.. తరుణ్ మాత్రం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు . మరి చూడాలి తరుణ్ తన రీఎంట్రీని ఎలా ప్లాన్ చేసుకుంటారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news