Moviesహైపర్ ఆది నోటి దూల..రోజాని అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!!

హైపర్ ఆది నోటి దూల..రోజాని అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!!

మనకు తెలిసిందే కొన్నాళ్లుగా జబర్దస్త్ పై సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో. కాగా టాప్ టాప్ కమెడియన్స్ అందరూ కూడా జబర్దస్త్ షో ని వీడి పక్క చానల్స్ కు వెళ్ళిపోతున్నారు. దానికి కారణాలు ఏవైనా కానీ షో మేనేజర్ ఏడుకొండలు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎక్స్ జబర్దస్త్ కంటెస్టెంట్ల అందరిని ఏకిపారేశారు. వాళ్ళ దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయని జబర్దస్త్ షోకి రాకుండా ఎలా తప్పుకుంటారో చూస్తానని ఓపెన్ గానే చెప్పుకొచ్చారు . అయితే ఆ మాటల నిజం చేస్తూ కొన్ని రోజుల క్రితమే గెటప్ శ్రీను జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చారు.


కాగా రీసెంట్ గా జబర్దస్త్ షోలోకి హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్. సెప్టెంబర్ 15న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. దానికి కారణం హైపర్ ఆది. మనకు తెలిసిందే హైపర్ ఆది ఎక్కడుంటే అక్కడ నవ్వులు, పంచులు, డబల్ మీనింగ్ డైలాగులు, అదిరిపోయే ఘాటు కౌంటర్లు తో హంగామా సృష్టిస్తాడు. వాటితోనే బాగా పాపులర్ అయ్యాడు . కాగా రీసెంట్ గా జబర్దస్త్ కి రీఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది మొదటి ఎపిసోడ్ తోనే స్టార్స్ పై పంచులు వేసి హైలెట్ గా మారాడు.

ఈ క్రమంలోనే హైపర్ ఆది ఎంట్రీకి ఓ రాజకీయ నాయకుడు వస్తున్నట్లు అతనికి స్వాగతం పలికారు. కాగా స్కిట్ లో భాగంగా హైపర్ ఆది ని ఓ మెడియన్..” నేను ఎగ్జామ్ రాసాను అయినా కానీ సీట్ రాలేదు” అంటూ చెప్పుకొస్తాడు . దీంతో హైపర్ ఆది పరోక్షంగా రోజాపై కౌంటర్ ఇస్తూ..” వస్తుంది లేరా ఏముంది.. రోజా గారికి మంత్రి సీటు రాలేదా.. ఇంద్రజ గారికి జబర్దస్త్ సీటు రాలేదా.. సీట్ రావడం పెద్ద విషయం కాదు లేరా..” అన్నట్టు మంత్రి రోజాపై పరోక్ష కామెంట్స్ చేశారు . దీంతో జబర్దస్త్ నుంచి ఆమె వెళ్ళిపోగానే నీకు నోరు ఎక్కువైపోయింది అంటూ కౌంటర్లు వేస్తున్నారు. రీసెంట్ గానే పవన్ ఫ్యాన్స్ కూడా ఆయనపై మండిపడిన విషయం తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news