Moviesఈ ఫొటోలో ఉన్న మ‌హేష్‌బాబు చెల్లిని గుర్తు ప‌ట్టారా... ఎవ‌రో తెలుసా...!

ఈ ఫొటోలో ఉన్న మ‌హేష్‌బాబు చెల్లిని గుర్తు ప‌ట్టారా… ఎవ‌రో తెలుసా…!

సినిమాల్లో మ‌హేష్‌బాబుకు అక్క‌, చెల్లిల్లిగా న‌టించిన వారు చాలా మందే ఉంటారు. అయితే వారిలో ఒక‌రిద్ద‌రితో మ‌హేష్‌కు నిజ జీవితంలో కూడా అదే అనుబంధం ఏర్ప‌డింది. అర్జున్‌లో మ‌హేష్‌కు చెల్లిగా న‌టించిన కీర్తిరెడ్డితో మ‌హేష్‌కు నిజంగానే సోద‌రి బంధం ఏర్ప‌డింది. సుమంత్‌తో కీర్తిరెడ్డి విడాకులు తీసుకున్న‌ప్పుడు కూడా వారిని క‌లిపి ఉంచేందుకు మ‌హేష్ చాలా ట్రై చేశాడ‌నే అంటారు.

ఇక గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోనే మ‌హేష్ న‌టించిన సినిమా ఒక్క‌డు. 2003 సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన ఈ సినిమా మ‌హేష్‌బాబుకు తిరుగులేని స్టార్‌డ‌మ్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో భూమిక చావ్లా హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాలో మ‌హేష్ చెల్లి ఆశా పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకుంది ఓ అమ్మాయి. ఇది జ‌రిగి కూడా 20 ఏళ్లు అవుతోంది. ఆ పాప ఇప్పుడు ఏకంగా పెద్ద‌దైపోయింది. బేబి నిహారిక‌గా అప్పుడు చాలా సినిమాల్లో న‌టించింది.

ఒక్క‌డు కంటే ముందే య‌మ‌జాత‌కుడు సినిమాలో మోహ‌న్‌బాబు మేన‌కోడ‌లిగా న‌టించింది. ఒక్క‌డు త‌ర్వాత నిహారికకు టాలీవుడ్‌లో మంచి పేరు వ‌చ్చింది. ఆమెకు చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే ఆమె చ‌దువు, కెరీర్‌పై కాన్‌సంట్రేష‌న్ చేసే క్ర‌మంలో సినిమాల‌కు దూర‌మైంది. ఇప్పుడు చ‌దువు పూర్తి చేసుకుంది. పెద్ద‌ది అయిపోవ‌డంతో సినిమాల‌పై దృష్టి పెడుతోంద‌ట‌.

నిహారిక ప్ర‌స్తుత ఫొటోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఓ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తోన్న సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైన‌ట్టు కూడా తెలుస్తోంది. ఈ సినిమా స‌క్సెస్ అయితే ఈ మ‌హేష్ చెల్లికి మంచి అవ‌కాశాలే వ‌స్తాయి. మ‌రి నిహారికి ఫేట్ ఎలా ఉందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news