Moviesచరణ్ బ్యూటీ ని పెళ్లి చేసుకోనున్న స్టార్ ప్రొడ్యూసర్..అస్సలు ఊహించలేదుగా..!?

చరణ్ బ్యూటీ ని పెళ్లి చేసుకోనున్న స్టార్ ప్రొడ్యూసర్..అస్సలు ఊహించలేదుగా..!?

యస్ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్త నిజమనే తెలుస్తుంది . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆడి పాడి చిందులేసిన బ్యూటీ నేహా శర్మ. అందరికీ గుర్తుండే ఉంటుంది కదా . అబ్బో మర్చిపోయే అందమా ఆమెది . ఓసోసి రక్కాసి.. అంటూ చరణ్ చేత ప్రపోజ్ చేయించుకున్న ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలే చేసింది . అయినా కానీ తనదైన స్టైల్ లో అభిమానులను సంపాదించుకుంది. అఫ్కోర్స్ ఈ బ్యూటీ తెలుగులో చేసింది రెండంటే రెండే సినిమాలు .

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన “చిరుత” ..రెండోది వరుణ్ సందేశ్ తో “కుర్రాడు”. ఈ రెండు సినిమాలు తప్పిస్తే అమ్మడు తెలుగులో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. దానికి కారణాలు అమ్మడు స్టోరీ చూసింగ్ బాగా లేకపోవడం వల్లనే అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ..నేహ శర్మ ట్రెండింగ్ లో కి వచ్చింది. హాట్ ఫోటోషూట్స్ చేస్తున్న నేహా శర్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలుస్తుంది. ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు బాలీవుడ్ ప్రొడ్యూసర్.. అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొంతకాలంగా యంగ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ తో డేటింగ్ లో ఉన్న నేహా శర్మ మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకొని ఓ ఇంటిది కాబోతున్నట్లు బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. కాగా రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాలో నేహా శర్మ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో నటించిన ఈ బ్యూటీ.. చిరంజీవి చేత కూడా శభాష్ అనిపించుకుంది. అంతేకాదు మొదటి సినిమా అయినా సరే ఏమాత్రం భయపడకుండా డైరెక్ట్ర్ చెప్పింది చెప్పినట్లు చేసింది. అయితే అర్థం కాని విషయం ఏంటంటే డైరెక్టర్స్ కి కోపరేట్ చేస్తున్నా కానీ ఈమెకు సినీ అవకాశాలు రాలేదు. మరి ఏంటో అ రహస్యం దేవుడికే తెలియాలి.. ఏదైతేనేం పెళ్లి చేసుకొని ఒక ఇంటిది కాబోతోంది నేహా శర్మ అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news