Moviesరకుల్‌ను తెగ నలిపేస్తున్నాడుగా... సీనియర్ హీరో మామూలోడు కాదు..!

రకుల్‌ను తెగ నలిపేస్తున్నాడుగా… సీనియర్ హీరో మామూలోడు కాదు..!

టాలీవుడ్లో ఛాప్టర్ క్లోజ్ అయ్యేసరికి బాలీవుడ్ బాట పట్టింది బక్కపలచని అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ ఓ సీనియర్ హీరోను గట్టిగానే పట్టుకుంది. ఆయన మన రకుల్‌ను బాగానే మోసుకొస్తున్నారు. తెలుగులో ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ టైం అస్సలు బాగలేదు. కానీ, వరుసగా హిందీ సినిమాలలో మాత్రం అవకాశాలు అందుకుంటోంది. అంతేకాదు, శంకర్ – కమల్ హాసన్ కలిసి నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఇండియన్ 2 లోనూ రకుల్ ఓ ప్రధాన పాత్రను పోషిస్తోంది.

అయితే, సౌత్‌లో కంటే నార్త్‌లో అమ్మడి హవా ఎక్కువగా కొనసాగుతోంది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్ర నటించిన ‘అయ్యారీ’ సినిమాతో హిందీలో అడుగుపెట్టింది రకుల్. ఈ సినిమా తర్వాత అక్కడే వరుసగా సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా అక్కడ సీనియర్ హీరో అజయ్ దేవగన్..రకుల్‌ను అసలు వదలడం లేదు. ‘దే దే ప్యార్ దే’ మూవీ నుంచి రకుల్ ని తన ప్రతి సినిమాలో తీసుకుంటున్నాడు.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది ‘దే దే ప్యార్ దే’. దాంతో రకుల్ ని సెంటిమెంట్ గా భావించి రకుల్ కి బాగానే అకవాశాలు కట్టబెడుతున్నాడు. ఇటీవల అజయ్ దేవగన్ డైరెక్ట్ చేసిన ‘రన్ వే 34’లోనూ రకుల్ ని హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అజయ్ తాజాగా మరో సినిమా కోసం కూడా రకుల్‌నే రికమండ్ చేశారట. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

అజయ్ దేవ్ గన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్ గాడ్’. టి సిరీస్, మారుతీ ఇంటర్నేషనల్ బ్యానర్స్ లో ఇంద్ర కుమార్ రూపొందిస్తున్నారు. ఇందులో సిద్ధార్ధ్ మల్హోత్ర కూడా నటిస్తున్నాడు. ఫాంటసీ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో అజయ్ మోడ్రన్ చిత్ర గుప్తుడిగా సందడి చేయబోతున్నాడు. అయితే, ఈ సినిమాలో రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

బాలీవుడ్‌లో మరే హీరో సినిమాను చేసే ఛాన్స్ అజయ్ దేవగన్ రకుల్‌కి ఇవ్వడం లేదు. అంతగా పట్టుకొని నలిపేస్తున్నాడు. ఏ హీరోయిన్‌కైనా కావాల్సింది వరుసగా అవకాశాలే. ఆ అవకాశాలే అజయ్ ఇస్తున్నాడు కాబట్టి రకుల్ ఆయనని వదలడం లేదంటున్నారు బాలీవుడ్ జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news