Moviesఫస్ట్ టైం లైగర్ రిజల్ట్ పై స్పందించిన విజయ్ దేవరకొండ..వాయిస్ తేడాగుందే..?

ఫస్ట్ టైం లైగర్ రిజల్ట్ పై స్పందించిన విజయ్ దేవరకొండ..వాయిస్ తేడాగుందే..?

అయ్యబాబోయ్.. లైగర్ సినిమా ఎంత కొంపముంచిందనుకున్నారు.. టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ మూవీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఓ పక్క భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయిన లైగర్ మూవీ ఫ్లాప్ అయిందని పూరీ బాధపడుతుంటే.. మరోపక్క కొందరు స్టార్స్ కూడా లైగర్ర్ మూవీ ఫెయిల్ అయిందని సెలబ్రేట్ చేసుకుంటున్నారట . దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అలాంటి వాళ్ళ బుద్ధి వచ్చేలా ట్రోల్ చేస్తున్నారు.

కాగా నిన్న మొన్నటి వరకు లైగర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ రచ్చ రచ్చ చేసిన జనాలే ఇప్పుడు లైగర్ మూవీ ఫ్లాప్ అంటూ ట్రోల్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ఫ్లాప్ పై ఎలా స్పందిస్తాడా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తారు. కాగా కొద్ది సేపటి క్రితమే విజయ్ దేవరకొండ ఈ సినిమా కి వచ్చిన రెస్పాన్స్ పై స్పందించినట్లు తెలుస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..” విజయ్ దేవరకొండ ,పూరి జగన్నాథ్ ,ఛార్మి”.. కొద్దిసేపటి క్రితమే మీట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

విజయ్ దేవరకొండ ఫస్ట్ టైం లైగర్ సినిమా రిలీజ్ తరువాత మీడియాతో మాట్లాడుతూ ..”సినిమా రిజల్ట్ బాగుందని.. కొందరికి నచ్చింది.. కొందరికి నచ్చలేదని” చెప్పుకొచ్చారు. ఆ వీడియోలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..” సినిమా బాగుంది. లైగర్ సినిమా కొందరికి నచ్చింది కొందరికి నచ్చలేదు. కానీ నా పర్ఫామెన్స్ కి జనాల రివ్యూ బాగుంది. సినిమాలో నత్తి వల్ల డైలాగ్స్ అర్థం కావడం లేదు అంటున్నారు. కానీ సినిమాకి అదే మెయిన్ పాయింట్ . ఒక మనిషి తనలోని లోపాన్ని ఎదిరించి విజయం ఎలా సాధించాడు అనేది సినిమా పాయింట్.

మనిషి దేనికి భయపడకూడదు అన్నది ఈ సినిమా కధ. చాలామంది జనాలకి సినిమాలో డైలాగ్స్ అర్థం కాలేదు అంటున్నారు. దానికి సారీ. కానీ చాలామంది సినిమా గురించి మంచిగా చెబుతున్నారు. నా నటన బాగుందంటున్నారు మీ అందరికీ ధ్యా,క. ఖచ్చితంగా నెక్స్ట్ మూవీ లో మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాను” అంటూ మాట్లాడిన్నట్లు ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై కొందరు విజయ్ హేటర్స్ ట్రోల్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో “ఆగ్ లాగా దేంగే” అంటూ గట్టిగా అరిచిన విజయ్.. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ వాయిస్ టోన్ తగ్గిందే.. వాట్ ఇస్ ది సీక్రెట్ విజయ్” అంటూ పుండు మీద కారం చల్లినట్టు రెచ్చగొడుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news