Moviesఆకలి తీర్చిన కామంగానే చూస్తారు..స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!!

ఆకలి తీర్చిన కామంగానే చూస్తారు..స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ని ఎలా చూస్తారు అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరోయిన్ అంటే కేవలం గ్లామరస్ రోల్ కు మాత్రమే పరిమితం అవుతుందని అనుకునే జనాభా మన చుట్టూ చాలామందే ఉన్నారు. దానిని నిజం చేస్తూ దర్శక నిర్మాతలు కూడా హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ రోల్ కే అంకితం చేస్తూ కథలు చూస్ చేసుకుంటారు. హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో నటించగలరని హీరోయిన్ గా నటించి సినిమాలో హిట్ కొట్టగలరని.. నిర్మాతలకు లాభం తెప్పించగలరని చాలా తక్కువ మంది దర్శక నిర్మాతలు హీరోయిన్స్ కి అవకాశాలు ఇస్తారు.


కాగా ప్రజెంట్ సినీ ఇండస్ట్రీ ఎలా ఉందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ రెచ్చిపోయి మరి నటిస్తున్నారు. ఒంటిమీద బట్ట ఉందా లేదా అన్నంత దారుణంగా ఫోటోషూట్లు గ్లామరస్ రోల్ లో నటిస్తున్నారు. ఈ క్రమంలోని స్టార్ హీరోయిన్ చేసిన బోల్డ్ కామెంట్స్ సంచలనంగా మారాయి. తాజాగా స్టార్ హీరోయిన్ మందాకిని సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని ఎలా చూస్తారు..వారి పై ఎలా మాట్లాడుకుంటారు.. ఒకప్పటి హీరోయిన్స్ కి ఇప్పటి హీరోయిన్స్ కి తేడా ఏమిటి.. అనే విషయాలపై బోల్డ్ కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఆమె మాట్లాడుతూ..” ఈ మధ్యకాలంలో సినిమా కథలో కంటెంట్ ఎలా ఉన్నా దానికి శృంగారానికి తగ్గట్టు కథను మలుచుకుంటున్నారు” అని షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతే కాదు ఇంకా మాట్లాడుతూ.. “మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఎంత అందాలను ఆరబోసినా.. జనాలు పెద్దగా తప్పుగా పట్టించుకోవడం లేదు.. కానీ, అదే నేను ఒకప్పుడు బిడ్డకు పాలిస్తూ.. ఆ బిడ్డ ఆకలి తీర్చిన సీన్స్ ను కూడా వల్గర్ గా చూసేవాళ్ళు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

మనకు తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కపూర్ హీరోగా నటించిన సినిమా “రామ్ తేరీ గంగా మైలీ” అనే సినిమాలో మందాకిని హీరోయిన్ గా పరిచయమైంది. ఫస్ట్ సినిమాతోనే బిగ్గెస్ట్ రిస్క్ చేసి క్లీవేజ్ అందాలు చూయించింది. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. అది ఓ తల్లిగా బిడ్డకు పాలు పట్టే సన్నివేశం అందులో కూడా జనాలు ఆమెలోని వల్గర్టీని చూశారు. అప్పట్లో ఈ సీన్ పెద్ద సంచలన సృష్టించింది. అలా ఓ మహిళ జాకెట్ తీసేసి బిడ్డకు పాలు ఇవ్వడం అనేది అప్పట్లో అశ్లీలత గా భావించేవారు.

ఆమె మాట్లాడుతూ….” ఇప్పుడు హీరోయిన్స్ ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్నారు . అయినా కానీ అది ఎవరికి వల్గర్ కనిపించట్లేదు. ఏమన్నా అంటే గ్లామర్ రోల్ అంటున్నారు. మరి నేను అప్పుడు చేసింది. ఓ బిడ్డకు పాలు పట్టిన సన్నివేశం. అది కూడా డైరెక్టర్ ఏదో జిమ్మికు చేసి చిత్రీకరించారు . అలాంటి సీన్ ని కూడా వల్గర్ గా చేసి..నా పై వేళ్లు ఎత్తి చూయించారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో బట్టలు విప్పుకుని తిరుగుతున్నా.. హీరోయిన్ లని ఏ మాత్రం తప్పుగా చూడటం లేదు. ఒకవేళ ఇప్పుడు కనక ఆసీన్ చేస్తే చాలామంది కామంతో చూస్తారేమో “అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news