Moviesసైలెంట్ షాక్ : గుట్టుచప్పుడుకాకుండా ఒక్కటైన బుల్లితెర జంట..బయటపెట్టిన బిగ్ బాస్...

సైలెంట్ షాక్ : గుట్టుచప్పుడుకాకుండా ఒక్కటైన బుల్లితెర జంట..బయటపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ !!

ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో చెప్పకుండానే నిశ్చితార్ధాలు, పెళ్లిలు చేసుకునేస్తున్నారు. కానీ డివర్స్ మాత్రం చెప్పి తీసుకుంటున్నారు . వారి ప్రైవసీ భంగం కలుగుతుందనో..లేక, మరేదైన రీజనో తెలియదు కానీ..స్టార్ సెలబ్రిటీలు అంతా ఇలానే చేస్తున్నారు. కానీ వాళ్లకి సంబంధించిన వార్తలు అన్ని మీడియాలో ముందే వినిపిస్తున్నాయి. అయితే, ఈ బుల్లితెర జంట మాత్రం ఎక్కడ బయట పడకుండా ..తమ ప్రేమ విషయం బయటకి రానివ్వకుండా..సైలెంట్ గా నిశ్చితార్ధం చేసుకునేసారు.

బుల్లితెర పై సీరియల్స్ చూసేవాళ్లకి అమర్‌దీప్‌ పేరు గురించి పెద్ద గా పరిచయం చేయాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో..చలాకీ తనంతో చిలిపి అలరితో..అందరిని నవ్విస్తూ..ఎప్పుడు తాను నవ్వుతూ ఉంటాడు. చాలా సరదాగా మాట్లాడుతూ అందరిని కలుపుకునిపోయే అమర్ ప్రజెంట్ జానకి కలగనలేదు అనే సీరియల్ లో నటిస్తున్నారు. ఈయన కన్నడ పరిశ్రమకు చెందిన తేజస్విని ని పెళ్లి చేసుకోబోతున్నాడు.

ఆమె కూడా మనకు బాగా సుపరిచితురాలే. ఒకప్పుడు కోయిలమ్మ సీరియల్ లో చిన్ని పాత్రతో అందరికి దగ్గరైన ఈ అమ్మడు ఇప్పుడు కూడా సీరియల్స్ లో నటిస్తుంది . తేజస్వి కేరాఫ్‌ అనసూయ సీరియల్‌ చేస్తోంది. అయితే, వీళ్లు ప్రేమించుకున్నట్లు..ఎక్కడ బయటపడకుండా సీక్రేట్ గా ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లికి రెడీ అయిపోయారు. తాజాగా నిశ్చితార్ధం కూడా చేసుకునేశారు. వీళ్ల పిక్స్ ని బిగ్ బాస్ బ్యూటీ అరియానా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవరకు ఎవ్వరికి తెలియదు. దీంతో వీళ్ల నిశ్చితార్ధానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news