Moviesనాగచైతన్య ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడో తెలుసా.. ఇంత చీపా..!?

నాగచైతన్య ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడో తెలుసా.. ఇంత చీపా..!?

టాలీవుడ్ కింగ్ నాగార్జున కొడుకు అక్కినేని నాగచైతన్య..ఈ మధ్య కాలంలో సినిమాలకన్నా ఎక్కువుగా వ్యక్తిగతంగానే మీడియాలో కనిపిస్తున్నాడు. సమంత ను పెళ్లి చేసుకున్నప్పుడు కన్నా కూడా విడిపోయాకనే మీడియాలో వైరల్ గా మారాడు. అయితే, పరసనల్ లైఫ్ డిస్టర్బ్ గా ఉన్నా..సినిమాలను మాత్రం ఆపడం లేదు. వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ..ఫుల్ జోష్ మీద ఉన్నాడు. రీసెంట్ గా చేసిన ధ్యాంక్యూ సినిమా ఫ్లాప్ అయినా..తన నటనకి మాత్రం మంచి పేరు వచ్చింది.

చాలా కూల్ గా హ్యండ్ సమ్ లుక్స్ లో కనిపించాడు నాగచైతన్య. ఇప్పుడు అందరి కళ్లు ఆయన తదుపరి సినిమా “లాల్ సింగ్ చద్దా” పైనే ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ లో తన అదృష్టాని పరిక్షించుకోబోతున్నాడు ..ఈ హీరో..ఈ సినిమా రిలీజ్ కాకముందే బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ అందుకున్నాట్లు తెలుస్తుంది. ఇండియన్ పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలాభన్సాలి డైరెక్షన్ లో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాగా, ఇప్పుడు నాగ చైత్నయ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

నిజానికి నాగచైతన్య మేకర్స్ ని ఎప్పుడు ఇంతే నాకు పారితోషకం కావాలి అని అడగలేదట. వాళ్లు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాడట. ఇప్పటి వరకు నాగచైతన్య ఒక్కో సినిమాకి 10 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకునేవారట. కానీ, లాల్ సింగ్ చద్దా కి మాత్రం 5 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట. నిజానికి నాగ చైతన్య లాంటి మరో స్టార్ వార్సులు ఒక్కో సినిమా 60 కోట్లు, 70 కోట్లు..అల్లు అర్జున్ అయితే 120 కోట్లు పారితోషకంగా పుచ్చుకుంటున్నారు. కానీ, నాగ చైతన్య ఇంకా 10 రేంజ్ లోనే ఉండటం కొంచెం బాధకలిగించే విషయం అంటున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news