Movies' లైగ‌ర్ ' టాక్ వ‌చ్చేసింది... పూరి మార‌లేదు.. విజ‌య్‌కు రాడ్...

‘ లైగ‌ర్ ‘ టాక్ వ‌చ్చేసింది… పూరి మార‌లేదు.. విజ‌య్‌కు రాడ్ దింపి దింపి వ‌దిలాడు…!

విజ‌య్ దేవ‌ర‌కొండ – పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన లైగ‌ర్ సినిమా భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే లైగ‌ర్ ప్రీమియ‌ర్ షోలు అమెర‌కాలో ప‌డ్డాయి. అక్క‌డ సినిమా చూసిన నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో సినిమా ఎలా ? ఉందో కామెంట్లు చేస్తున్నారు. ఓవ‌రాల్‌గా మెజార్టీ నెటిజ‌న్ల అభిప్రాయం ప్ర‌కారం సినిమాకు బ్యాడ్ రిపోర్టే వ‌స్తోంది. సినిమా అంచ‌నాల‌కు పూర్తి విరుద్ధంగా ఉంద‌నే అంటున్నారు.

పూరి విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి హీరోతో ప‌ర‌మ చెత్త సినిమా తీశాడ‌నే కామెంట్లు పెడుతున్నారు. ఓ పొటెన్షియ‌ల్ సినిమాను అర్థం ప‌ర్థం లేకుండా.. చాలా చెత్త‌గా తీశాడ‌నే చెపుతున్నారు. అస‌లు ఏ మాత్రం ఆక‌ట్టుకోని సీన్లు ద్వారా సినిమాను క‌లగా పుల‌గం చేసేశాడ‌నే అంటున్నారు. సినిమా మొత్తం మీద హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ బాడీ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ బాగుంద‌ని.. న‌టుడిగా త‌న వ‌ర‌కు తాను బెస్ట్ ఇచ్చేందుకు బాగా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని ప్ర‌శంసిస్తున్నారు.

ఇక హీరోయిన్‌తో ల‌వ్ ట్రాక్ గురించి ఘోరంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రాక్ చాలా దారుణంగా ఉంద‌ని విమ‌ర్శిస్తున్నారు. ఫ‌స్టాఫ్‌లో ఎలివేష‌న్ సీన్లు, కొన్నిసీన్లు త‌ప్పా సినిమా గురించి చెప్పుకోవ‌డానికేం లేదంటున్నారు. ఫ‌స్టాఫ్ అంతంత మాత్రంగా ఉందిరా దేవుడా ? అనుకుంటే.. ఇక సెకండాఫ్ మ‌రీ ఘోరంగా ఉంద‌నే చెపుతున్నారు. ఓవ‌రాల్‌గా పూరి చాలా అంటే చాలా డిజ‌ప్పాయింట్ చేశాడ‌ని

ఇక క్లూలెస్‌ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పూర్తిగా నెగటివ్ సైడ్ ట‌ర్న్ తీసుకుని పిచ్చెక్కిచింద‌నే అంటున్నారు. విజ‌య్ లాంటి క్రేజ్ ఉన్న హీరోతో వ‌చ్చిన మంచి గోల్డెన్ ఛాన్స్‌ను పూరి మిస్ చేసుకున్నాడ‌ని చెపుతున్నారు. ఘోర‌మైన ర‌చ‌న‌కు తోడు భ‌యంక‌ర‌మైన స్క్రీన్ ప్లేతో ప్రేక్ష‌కుడితో పూరి ఆడుకున్నాడ‌నే చెపుతున్నారు. అస‌లు సినిమాలో క‌థ ఏంటో కూడా పూరికే తెలియ‌న‌ట్టుగా సినిమా ఉంద‌ని అంటున్నారు.

ఇక ఎన్నో ఆశ‌ల‌తో ఉన్న మైక్‌టైస‌న్ పాత్ర‌ను కూడా కామెడీగా మార్చేయ‌డం పూరి ఘ‌న‌త‌గా సెటైర్లు వేస్తున్నారు. అస‌లు పూరి మార్క్ డైలాగులే లేవ‌ని చెపుతున్నారు. ఓవ‌రాల్‌గా సినిమా ఎప్పుడు ఎటు నుంచి ఎటు వెళుతుందో ? కూడా త‌మ‌కే అర్థం కాని ప‌రిస్థితి ఉంద‌ని.. విజ‌య్ లాంటి క్రేజీ హీరో పాన్ ఇండియా ఎంట్రీకి ఇది ఏ మాత్రం స‌రితూగే సినిమా కాద‌నే ఎక్కువ మంది చెపుతున్నారు. ఏదేమైనా పూరి విజ‌య్‌ను నిండా ముంచేశాడ‌ని టాక్ ? ఏదేమైనా లైగ‌ర్‌పై సోష‌ల్ మీడియాలో కంప్లీట్ నెగ‌టివ్ టాక్ న‌డుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news