Movies' లైగ‌ర్ ' ప్రీమియ‌ర్ షో టాక్‌... విజ‌య్ హిట్‌.. పూరి...

‘ లైగ‌ర్ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… విజ‌య్ హిట్‌.. పూరి ఫ‌ట్‌

భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమా ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా ఉండ‌డం, ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత పూరి డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో లైగ‌ర్‌కు మంచి బ‌జ్ వ‌చ్చింది. అందుకు త‌గిన‌ట్టుగానే ప్రి రిలీజ్ బిజినెస్‌, అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా భారీ స్థాయిలో జ‌రిగాయి. ఇక ఈ రోజు ప్రీమియ‌ర్ షోల త‌ర్వాత ఈ సినిమాకు ఎలాంటి టాక్ వ‌చ్చిందో చూద్దాం.

ఇక సినిమా ఫస్టాఫ్ వ‌ర‌కు చూస్తే చాలా యావ‌రేజ్‌గా సాగింది. వెరీ వెరీ యావ‌రేజ్ సీన్ల‌తోనే సినిమా న‌డుస్తుంది. అయితే విజ‌య్ సూప‌ర్ సాలిడ్ స్క్రీన్ ప్రెజ‌న్స్ మాత్రం బాగుంది. ఫ‌స్టాఫ్‌లో ఆక‌ట్టుకునే సీన్లు కూడా లేవు. అస‌లు మెయ‌న్ క‌థ‌లోకే పూరి వెళ్ల‌లేదు. ఫైట్స్‌, సాంగ్స్ , ర‌మ్య‌కృష్ణ ఎంట్రీ మాత్ర‌మే ఫ‌స్టాఫ్‌లో చెప్పుకోద‌గ్గ సీన్లు. ఓవ‌రాల్‌గా చూస్తే సినిమా ఊహాజ‌నిత‌మైన ప్లాట్‌తో ఉంటుంది. విజ‌య్ న‌ట‌న‌, హీరో క్యారెక్ట‌రైజేష‌న్ మాత్ర‌మే సినిమాకు ప్ల‌స్‌.

అన‌న్య పాండే – విజ‌య్ దేవ‌ర‌కొండ ల‌వ్ ట్రాక్ పూరి చాలా పేలవంగా రాసుకున్నాడు. ఇది సినిమాకు ఎంత మాత్రం యూజ్ అవ్వ‌లేదు. క‌థ కూడా పూర్తిగా ఊహ‌ల‌కు అనుగుణంగానే సాగుతుంది. ఓవ‌రాల్‌గా హీరో క‌ష్ట‌ప‌డినా, కావాల్సినంత కాస్టింగ్‌, బ‌డ్జెట్ ఉన్నా కూడా ఆక‌ట్టుకుని సినిమాను బ్లాక్‌బ‌స్ట‌ర్ చేసే స‌న్నివేశాలు పెట్ట‌డంలో ద‌ర్శ‌కుడు పూరి ఫెయిల్ అయ్యాడ‌నే ఎక్కువ మంది చెపుతున్నారు.

విజ‌య్ న‌త్తిగా మాట్లాడ‌డం కూడా స్టార్టింగ్‌లో బాగున్నా.. త‌ర్వాత క‌థ సాగుతున్న కొద్ది అది కూడా బాగా బోర్ కొట్టేసింద‌నే అంటున్నారు. విజ‌య్ – అన‌న్య మ‌ధ్య బ్రేక‌ప్‌.. త‌ర్వాత వీళ్లు క‌లుసుకోవ‌డం మ‌ధ్య సీన్లు కూడా ఏమంత ఆస‌క్తిగా లేవు. ఓవ‌రాల్‌గా చూస్తే లైగ‌ర్ ప్రీమియ‌ర్ షో టాక్ ప్ర‌కారం హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ హిట్ అయితే.. పూరి ఫ‌ట్ అయ్యాడ‌నే అంటున్నారు. మ‌రి ఇండియ‌న్ ఆడియెన్స్ టాక్ ప్ర‌కారం సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news