Moviesలైగర్‌ మూవీ రివ్యూ: ఆ ఒక్క సీన్ మార్చుంటే.. సినిమా రేంజ్...

లైగర్‌ మూవీ రివ్యూ: ఆ ఒక్క సీన్ మార్చుంటే.. సినిమా రేంజ్ మారిపోయేది కదా పూరి..!?

అయ్యయ్యో పాపం పూకి మళ్ళీ ఫ్లాపేనా..? అరే విజయ్ దేవరకొండ ఇప్పుడూ తన ముఖం ఎలా చూపిస్తాడు..? ఇప్పుడు జనాలు ఇలాంటి కామెంట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు కొందరు ట్రోలర్స్. పూరి అంటే ఇష్టం లేదో.. లేక పూరీ మీద కక్ష కట్టారో తెలియదు కానీ.. మొత్తానికి కొందరు అనుకున్న విధంగా లైగర్ మూవీ ని ఫ్లాప్ చేసేసారు. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూరి కెరీర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకేక్కిన లైగర్ మూవీ కొద్దిసేపటి క్రితమే ఫస్ట్ షో పడింది. ఫస్ట్ టాక్ తోనే భారీ డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది లైగర్ .

అసలు ఈ సినిమా కథను పూరి జగన్నాధ్ ఎలా రాశాడో ఎలా తెరకెక్కించాడో.. ఏమనుకుని సినిమాను మన కంటికి చూపించాడో.. ఏమాత్రం అర్థం కావడం లేదు అంటున్నారు సినిమా చూసిన జనాలు . సినిమాలో హీరోయిన్ రమ్యకృష్ణ నా..లేక అనన్య పాండే నా అనే డౌట్ రాక తప్పదు సినిమా చూసే జనాలకి. ఎందుకంటే అనన్యాని పూరీ కేవలం ఎక్స్పోజింగ్ కోసం మాత్రమే వాడుకున్నారని.. కథలో అసలు అనన్య పాత్ర లేనేలేదని.. సినిమా మొత్తం హీరో ఓరియెంటెడ్ సినిమా గానే ఉందని.. ఖచ్చితంగా ఇది పూరి రేంజ్ సినిమా కాదు అంటూ జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు . మరీ ముఖ్యంగా పూరి ఈసారి ఎలాగైనా హిట్ కొడతాడని బోలెడన్ని ఆశలు పెట్టుకుని థియేటర్లకు వెళ్లిన జనాలు ముఖం మాడ్చుకుని థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇక పూరి చాప్టర్ క్లోజ్ అయిందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

అయితే కొందరు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయి ఉండేదని కానీ, సెన్సార్ సభ్యులు ఏడు సీన్లను కట్ చేసేసారని.. వాటిలో ఓ సీను మాత్రం ఇంటర్వెల్లో పెట్టుంటే సినిమా కచ్చితంగా హిట్ కాకపోయినా.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకునేదని.. సినిమాకు ప్రాణం పోసే ఆ ఏడు సీన్లని సెన్సార్ సభ్యులు కట్ చేయడం పూరి లైగర్ కు భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడానికి కారణమైంది అంటున్నారు కొందరు జనాలు. అంతేకాదు ఈ సినిమా ఇంచు మించు అమ్మానాన్న తమిళ అమ్మాయి కథలానే ఉందంటున్నారు. కానీ పూరీ జాగ్రత్త పడుతూ అక్కడక్కడ కొన్ని ఘాటైన సీన్లను.. పచ్చి బూతు పదాలను వాడుతూ.. సినిమాకు మరింత హైప్ తీసుకో రావడానికి ట్రై చేశాడని. కానీ ఆ విషయంలో పూరి జగన్నాథ్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడని జనాలు రివ్యూ ఇస్తున్నారు. టాక్ తోనే డిజాస్టర్ గా నిలిచిన లైగర్ ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి మరి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news