Moviesహమ్మయ్య..ఆ విషయంలో సమంత బ్యాక్ స్టెప్..ఊపిరి పీల్చుకున్న అక్కినేని ఫ్యాన్స్..!?

హమ్మయ్య..ఆ విషయంలో సమంత బ్యాక్ స్టెప్..ఊపిరి పీల్చుకున్న అక్కినేని ఫ్యాన్స్..!?

హమ్మయ్య ఆ విషయంలో సమంత వెనకడుగు వేసిందా.. పోనీలే మంచిది అనుకుంటున్నారు సమంత అభిమానులు. అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సమంత ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఏం మాయ చేసావే సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సమంత.. ఆ తర్వాత వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుని.. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాజ్యమేలుతుంది.

అమ్మడు అదృష్టమో లేక కష్టపడిందో తెలియదు కానీ వరుసగా బిగ్ స్టార్స్ కూడా ఆమెకు సినిమాల అవకాశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే సమంత మరిన్ని విజయాలు తన ఖాతాలో వేసుకునేందుకు అవకాశం దక్కింది. సమంత అనుకోకుండా నాగచైతన్యను దూరం చేసుకుంది . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనుకోకుండా అభిమానులు ఊహించని విధంగా విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. ” మేం విడాకులు తీసుకున్న మంచి ఫ్రెండ్స్ గానే ఉంటామంటూ భారీ ప్రకటన ఇచ్చిన ఈ జంట …ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో పరోక్షంగా తిట్టుకుంటూనే ఉన్నారు “. మొన్నటికి మొన్న సమంత కాఫీ విత్ కరణ్ షోలో.. నాగచైతన్య పై సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

” మా విడాకులు కూల్ గా జరగలేదు అంటూ బిగ్ బాంబ్ పేల్చిన సమంత. మా ఇద్దరిని ఒకే గదిలో పెడితే కచ్చితంగా పదునైనా ఆయుధాలు పెట్టాలంటూ హోస్ట్ కరణ్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. ఈ ఒక్క మాటతో అక్కినేని అభిమానులు కోపంతో ఊగిపోయారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు సమంత చాలా దూరంగా ఉంటుంది . అసలు కనిపించడం లేదు .దీంతో అంతా సమంతకు ఏమైందో అంటూ బాధపడ్డారు . అయితే సమంత కావాలని సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందంటూ ఓ వార్త బయటకు వచ్చింది .

కాగా గత కొన్ని రోజులుగా సమంత మరోసారి ఐటెం సాంగ్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పటికే పుష్ప సినిమాలో “ఊ అంటావా మామ “అంటూ దేశాన్ని ఓ ఊపు ఊవేసిన సమంత ..మరోసారి ఆ స్టైల్ తో ఆ హాట్ నెస్ తో ఐటమ్ సాంగ్ చేస్తే చూసి తట్టుకోలేము రా బాబు అంటూ ఫ్యాన్స్ బాధపడ్డారు.

ఈ లిస్టులో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత ఎటువంటి ఐటమ్ సాంగ్ అంగీకరించలేదట. అంతేకాదు ఇకపై భవిష్యత్తులో కూడా ఐటమ్ సాంగ్ చేయనని కరాఖడిగా చెప్పేస్తుందట తన దగ్గరకు వచ్చిన డైరెక్టర్లకి. దీంతో ఈ విషయం తెలుసుకున్న సమంత అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు . సమంతని మేము హీరోయిన్ గానే చూడాలనుకుంటున్నామని ఐటెం గర్ల్ గా కాదు అని కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news