Moviesఇదే తమన్నాకు లాస్ట్ వార్నింగ్..ఆ తరువాత జరగబోయేది ఇదే..!?

ఇదే తమన్నాకు లాస్ట్ వార్నింగ్..ఆ తరువాత జరగబోయేది ఇదే..!?

తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయినా ఇప్పటికి హీరోయిన్ గా అవకాశాలు తెచ్చుకుంటూనే ఉంది. సినీ ఇండస్ట్రీని తన అంద చందాలతో ఏలేస్తుంది. అయితే సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తనకున్న ఆఫర్స్ ఇప్పుడు రావట్లేదని చెప్పాలి . దానికి కారణాలు ఏవైనా కానీ మెయిన్ కారణం తనకంటే పెద్ద వయసు గల హీరోలతో నటించడమే అంటూ అప్పట్లో సినీ విశ్లేషకులు చెప్పుకొచ్చాను. ఈ కారణంగానే యంగ్ హీరోస్ తో సినిమాలు చేస్తున్న తమన్నా సీనియర్ హీరోల కధలని యాక్సెప్ట్ చేసి కెరియర్ లో బిగ్గెస్ట్ తప్పు చేసింది అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

అంతేకాదు తమన్నా ప్రజెంట్ చిరంజీవి సరసన భోళ శంకర్ సినిమాలో నటిస్తుంది. అది కాకుండా తమన్న చేతులు మరో సినిమా “గుర్తుందా శీతాకాలం” కూడా ఉంది. అయితే ఇవి తప్పిస్తే తమన్నా ఖాతాలో పెద్దగా చెప్పుకోతగ్గ సినిమాలు లేవు. ఈ రెండింట్లో కూడా భోళ శంకర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ గుర్తుందా శీతాకాలం సినిమా తమన్నా అభిమానులు ఫీల్ అవుతున్నారు. కాగా ఎప్పుడో సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఇప్పుడు ఎట్టకేలకు సెప్టెంబర్ 23న సినిమా రిలీజ్ చేయడానికి మేకర్ డిసైడ్ అయ్యారు. అయితే తమన్నాకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


తమన్నా హ్యాపీడేస్ సినిమా టైంలోలా తన కెరీర్ ముందుకు సాగాలంటే భోళ శంకర్, గుర్తుందా సీతాకాలం ఈ రెండు సినిమాలు హిట్ అవ్వాల్సిందే. వీటిలో ఏ ఒక్కటి ఫ్లాప్ అయినా లేక రెండు సినిమాలు ఫ్లాప్ పైన తమన్నా కెరీయర్ చెప్పుకోతగ్గ ఆశించే స్థాయిలో ఉండదని అంటున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాదు తమన్నా ఫ్యాన్స్ కూడా అదే మాట అంటున్నారు. తమన్నా కు ఇదే లాస్ట్ ఛాన్స్ అని ఈ సినిమాలో కానీ ఫ్లాప్ అయితే తమన్నా ఇంకా పెళ్లి చేసుకోని కెరియర్ లో సెటిల్ అయిపోవడం మంచిదని కామెంట్స్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news