Moviesవావ్: మహేశ్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్.. బర్తడే ట్రీట్ వచ్చేసిందోచ్..!?

వావ్: మహేశ్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్.. బర్తడే ట్రీట్ వచ్చేసిందోచ్..!?

అభిమానులు సార్ అభిమానులు అంతే..అనాల్సిందే. ఏ హీరో అభిమానులు అయినా సరే..వాళ్ళ ఫేవరేట్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు అది వాళ్లకి పెద్ద పండగే. ఆ రోజు వాళ్లు చేసే హంగామా రచ్చ అబ్బో ఆ ఆనందం వాళ్ళకు మాత్రమే తెలుసు. అంత పిచ్చి అభిమానం తెలుగు జనాలకి. ఒక్క హీరో అనే కాదు ఇండస్ట్రీలో ఉండే ఆల్ మోస్ట్ అందరి హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ ఇంతే. హీరోల పుట్టిన రోజు వస్తుందంటే.. తమ పుట్టిన రోజు కన్నా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి అభిమానులను కూడకట్టుకుంటారు.

ఇప్పుడు అలా గే అంతా ఒక్క చోట చేరారు మహేశ్ బాబు అభిమానులు. ఈ నెల 9న మహేశ్ బాబు పుట్టిన రోజు. ఆ రోజు అభిమానులకు ఓ పండగ రోజు. ఎక్కడక్కడ ఉన్న ఆయన అభిమానులంతా ఒక్క చోట చేరి కేక్ కట్ చేసి… తమకు తోచిన విధంగా..పేదలకు సహాయం చేయడం..ఫుడ్ ప్యాకెట్స్ పంచడం చేస్తుంటారు. ఈసారి కూడా అలానే చేయడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. అయితే, ఈసారి మహేశ్ అభిమానులకు షాకింగ్ సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు ఈ హీరో.

తన తదుపరి సినిమా కు సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా రీవిల్ చేయబోతున్నారట. అసలే షూటింగ్స్ బంద్..పైగా మహేశ్ బాబు అవుట్ డోర్ లో ఉన్నాడు. ఈసారి ఏం పార్టి ఉండదా..అని అనుకున్న జనాలకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు మహేశ్ బాబు. ఇండియాలో ఉన్నప్పుడే ఆయన ఫస్ట్ లుక్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకునే ..టూర్ కు జంప్ అయ్యాడట. త్రివిక్రమ్ తో మహేశ్ సినిమా అంటే మామూలుగా ఉండదు. గత సినిమాలు అలాంటి హైప్ క్రియేట్ చేసాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకి అర్జునుడు అనే టైటిల్ ని కన్ ఫామ్ చేసిన్నట్లు సమాచారం. మహేశ్ బర్తడే రోజున ఉదయం 9:09 నిమిషాలకు ఈ ఫస్ట్ లుక్స్ ని రివీల్ చేయబోతున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news