Moviesఇండ‌స్ట్రీకి బిగ్ షాక్‌... బిగ్‌బ్యాస్ బ్యూటీ హ‌ఠాన్మ‌ర‌ణం..

ఇండ‌స్ట్రీకి బిగ్ షాక్‌… బిగ్‌బ్యాస్ బ్యూటీ హ‌ఠాన్మ‌ర‌ణం..

గ‌త రెండేళ్లుగా ఎంట‌ర్టైన్‌మెంట్ రంగానికి చెందిన ప‌లువురు ఆక‌స్మికంగా మృతి చెందుతున్నారు. క‌రోనాకు ముందు నుంచి .. ఆ త‌ర్వాత కూడా చాలా మంది సినీ, బుల్లితెర రంగాల‌కు చెందిన ప్రముఖుల‌ను కోల్పోయాము. తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ ఒక‌రు ఆక‌స్మికంగా మృతి చెందారు. బిగ్‌బాస్ బ్యూటీ సోనాలి ఫోగ‌ట్ (43) సోమ‌వారం రాత్రి ఆక‌స్మికంగా మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపింది. గోవాలో ఆమె గుండెపోటుతో మృతి చెందిన‌ట్టు కుటుంబ స‌భ్యులు చెపుతున్నారు.

సోనాలి ఫోగ‌ట్ బుల్లితెర రంగంతో పాటు రాజ‌కీయాల్లోనూ కొన‌సాగుతున్నారు. ఆమె హిందీ బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-14లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి సంచ‌లనం రేపారు. అలాగే సోనాలి 2006లో టీవీ యాంక‌ర్‌గాను, న‌టిగాను కెరీర్ స్టార్ట్ చేసి .. మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. సోష‌ల్ మీడియాలోనూ ఆమెకు ఫాలోవ‌ర్స్ ఉన్నారు. 2008లో బీజేపీలో చేరిన ఆమె టిక్ టాక్ ద్వారా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యారు.

ఇక గ‌త కొంత కాలంగా ఆమె బీజేపీ స్టార్ క్యాంపెయిన‌ర్‌గా ఉన్నారు. 2019 హర్యానా ఎన్నికల్లో ఆమె అదాంపూర్‌ నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కొద్ది రోజుల క్రితం కొంత‌మందితో క‌లిసి గోవా టూర్‌కు వెళ్లిన ఆమె గ‌త రాత్రి ఆక‌స్మాత్తుగా గుండెపోటు రావ‌డంతో మృతి చెందారు. దీంతో బీజేపీ నాయ‌కుల‌తో పాటు ఆమె అభిమానులు విచారం వ్య‌క్తం చేస్తూ ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నారు.

మ‌రో విషాదం ఏంటంటే సోనాలి ఫోగట్‌ భర్త 2016లో హిస్సార్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ త‌ర్వాత 2020లో ఓ అధికారిని చెప్పుతో కొట్టి ఆమె కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news