Moviesబాల‌య్య‌తో క‌ళ్యాణ్‌రామ్ సినిమా ఫిక్స్‌... డైరెక్ట‌ర్ ఎవ‌రంటే...!

బాల‌య్య‌తో క‌ళ్యాణ్‌రామ్ సినిమా ఫిక్స్‌… డైరెక్ట‌ర్ ఎవ‌రంటే…!

నందమూరి హీరోలు బాలకృష్ణ – ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. గత ఏడాది చివర్లో అఖండ సినిమాతో బాలయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి కరోనా తర్వాత తెలుగు సినిమాకు మంచి ఊపు తెచ్చాడు. ఇక ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తర్వాత కూడా ఈ ముగ్గురు నందమూరి హీరోల లైన్ అప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది.

ఇక నందమూరి హీరోలు కలిసి నటిస్తే చూడాలని తెలుగు సినిమా అభిమానులు అందరూ గత 20 ఏళ్ల నుంచి ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ – బాలయ్య కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అన్న ఆశలతో ఉన్నారు. ఇక తన తాత ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి వరుసగా సినిమాలు నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ తన సోదరుడు ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమా నిర్మించి హిట్ కొట్టాడు. ఇక బాబాయ్ బాలయ్య తోను కళ్యాణ్ రామ్ తన బ్యానర్ లో సినిమా తీయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు.

తాజాగా బింబిసార ప్రమోషన్లలో కళ్యాణ్ రామ్ బాబాయ్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు. తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న తదుపరి సినిమాల గురించి మాట్లాడిన కళ్యాణ్ రామ్ ఆర్ఆర్ ఆర్‌ వంటి గ్లోబల్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన బ్యానర్ లోనే వరుసగా రెండు సినిమాలు చేస్తున్నాడని.. ఈ రెండు సినిమాలు కూడా ఎంతో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నామని తెలిపాడు. అలాగే బాబాయ్ బాలయ్యతో కూడా తన ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యానర్ లో ఒక సినిమా చేయాలని ఇటీవల అనుకున్నాం.. త్వరలోనే ఆ సినిమా కూడా ఉంటుందని కళ్యాణ్ రామ్ స్పష్టం చేశాడు.

ఈ సినిమా గురించి వివరాలు కూడా త్వరలోనే వెల్లడి కానున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బాలయ్య హీరోగా – పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కు కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఉంటారని తెలుస్తోంది. ఏదేమైనా బాబాయ్ అబ్బాయి కాంబినేషన్లో సినిమా అంటే నందమూరి అభిమానులకు పెద్ద పండ‌గే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news