Movies20 ఏళ్లలో ఛార్మి సినిమాల ద్వారా ఇంత వెన‌కేసుకుందా... షాకింగే..!

20 ఏళ్లలో ఛార్మి సినిమాల ద్వారా ఇంత వెన‌కేసుకుందా… షాకింగే..!

ఛార్మి… 35 ఏళ్ల వయసులోనూ సూపర్ లుక్‌లో మెస్మరైజింగ్ అందంతో అందరినీ ఆకర్షిస్తూనే ఉంటుంది. సినిమాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశం లేకపోయినా ప్రొడ్యూసర్ గా మారి సినిమాలో నిర్మిస్తోంది అంతేకాదు సినిమాల్లోకి రావాలి అని అనుకునే వారికి ఎలా ? అవకాశాలు పట్టుకోవాలి అని అంశంపై శిక్షణ కూడా ఇస్తోంది. అందుకే ఆమె చుట్టూ చాలా మంది మోడల్స్ కనిపిస్తూ ఉంటారు. మంత్ర, అనుకోకుండా ఒక రోజు, మాస్, రాఖీ వంటి సినిమాల్లో నటించిన ఛార్మి మంచి పేరు సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నటించింది.

ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అవుతున్నా ఇంకా ఇక్క‌డ లైమ్‌టైమ్‌లోనే ఉంది. ఛార్మి ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి సినిమా నిర్మాణంలో బిజీగా ఉంది. పూరి చేస్తున్న ప్రతి సినిమాకి ఛార్మి ఉండాల్సిందే. ఇక ఛార్మీ త‌న ప‌క్క‌న ఉంటే బాగా క‌లిసొస్తోంద‌ని పూరి నమ్ముతూ ఉంటాడు. వీరు ఇద్దరు కలిసి పూరి కనెక్ట్స్ అనే బ్యానర్ స్థాపించారు. ఈ రెండు దశాబ్దాల టైంలో ఛార్మి హీరోయిన్‌, నిర్మాత‌గా ఎంత ఆస్తులు కూడా పెట్టింది అన్న‌దానిపై ఇండ‌స్ట్రీలో చాలా లెక్క‌లే ఉన్నాయి.

ఛార్మి ఫామ్‌లో ఉన్న‌ప్పుడు ప్రతి సినిమాకి దాదాపుగా కోటి రూపాయల వరకు పారితోషకం తీసుకునేది. ఇక ఇప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలకి తనవంతు బాధ్యతలు తీసుకొని దాదాపు రెండు కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది. 2019 లెక్కల ప్రకారం ఆమె నెట్ విలువ‌ ఏకంగా రెండు మిలియన్ డాలర్ల వరకు ఉందట. ఇక ఛార్మి దగ్గర లక్షల విలువ చేసే మూడు కార్లు కూడా ఉన్నాయి.

68 లక్షలతో బిఎండబ్ల్యూ X త్రీ కారుని మొదట కొనుగోలు చేసిన ఛార్మి, దాదాపు రెండున్నర కోట్లు పెట్టి బీఎండబ్ల్యూ 730 LD కారును కొనుగోలు చేసింది. ఇక అమే గ్యారేజ్‌లో టోయోట ఇన్నోవా క్రిస్టా సైతం రు. 37 లక్షలతో కొనుగోలు చేసి పెట్టుకుంది. ఇక ఛార్మికి ముంబైలో మూడు, నాలుగు అపార్ట్మెంట్లు ఉన్నాయి. హైదరాబాదులోని గచ్చబౌలిలో గోల్డ్ ఎడ్జ్ అపార్ట్మెంట్స్ లోనూ ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఇక్కడే తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది ఛార్మి. ఇది ఈ 20 ఏళ్లో ఛార్మీ కూడ‌బెట్టిన ఆస్తులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news