Moviesపిచ్చిగా ప్రేమించి పెళ్లాడిన భ‌ర్త‌కు రాఘ‌వేంద్రుడి కోడ‌లు ఎందుకు విడాకులు ఇచ్చేసింది...!

పిచ్చిగా ప్రేమించి పెళ్లాడిన భ‌ర్త‌కు రాఘ‌వేంద్రుడి కోడ‌లు ఎందుకు విడాకులు ఇచ్చేసింది…!

సినిమా సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో అంతే త్వరగా విడాకులు కూడా జరిగిపోతున్నాయి. కొన్ని జంటలు దశాబ్దాల పాటు కలిసి ఉంటే… మ‌రికొంద‌రు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకుంటున్నారు. మరికొందరు మాత్రం పెళ్లయ్యాక రెండు మూడేళ్లకే విడిపోతున్నారు. గత ఏడాదికాలంగా మన దేశంలో సినిమా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుని పెద్ద షాక్ ఇచ్చారు. సమంత – నాగచైతన్య, అమీర్ ఖాన్ -కిరణ్ రావు, ఐశ్వర్య- ధనుష్, విడాకులు తీసుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు.

కొన్నేళ్ల క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు కోవెలమూడి ప్రకాష్, ఆయన భార్య బాలీవుడ్ స్టార్ రైటర్ కనిక థిల్లాన్ విడాకులు తీసుకున్నారు. అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా ? చిగురించింది.. ప్రకాష్ ను పిచ్చిగా ప్రేమించిన కనిక ఎందుకు ? విడాకులు ఇచ్చింది అన్నది అప్పట్లో ఎవ్వరికి అర్థం కాలేదు. కనిక బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ రెడ్ చిల్లిస్‌ సంస్థలో క్రియేటివ్ కంటెంట్ రైటర్ గా పనిచేసేవారు. ఆ సమయంలో ప్రకాష్ తో ఆమెకు ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఒకానొక సమయంలో ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేక హాస్పటల్లో ఉన్నప్పుడు ప్రకాష్ వారం రోజులు పాటు దగ్గరుండి ఆమెకు సపర్య‌లు చేయడంతో పాటు.. ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నారట.

ఆ సమయంలో కనిక అమ్మ హాస్పిటల్ లో ఉన్నా ఆమెను ఇంటికి పంపించి మరి ప్రకాష్ వారం రోజులపాటు ఆమెతోనే హాస్పిటల్లో ఉన్నారు. ఆ ప్రేమ చూసిన కనిక థిల్లాన్‌ ప్రకాష్ తో ప్రేమలో పడిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వాస్తవానికి రాఘవేంద్రరావుకు ఈ పెళ్లి ఇష్టం లేదని కూడా అంటారు. అయితే కుమారుడి ఇష్టాన్ని కాదనలేక ఆయన ఈ పెళ్లికి అంగీకరించారన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి. అనుష్కతో సైజ్ జీరో తెరకెక్కించిన ప్రకాష్ కోవెలమూడికికి క‌థ ఇచ్చింది కూడా ఆమెనే.

భర్తతో కలిసి పలు చిత్రాలకు పని చేసినా వాటితో ఆశించిన విజయాలు దక్కలేదు. కానీ కనికకు బాలీవుడ్ లో పెద్ద సక్సెస్‌లే ద‌క్కాయి. 2014లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు ఇక విడాకులు తీసుకోవడానికి రెండు సంవత్సరాల ముందు నుంచి వీరిద్దరూ మనస్పర్ధలతో వేరువేరుగా ఉన్నారు. అసలు వీరు ఏ కారణంతో విడిపోయారు అన్నదానిపై టాలీవుడ్ లో అంతర్గతంగా ఒక చర్చ అయితే అప్పట్లో వినిపించింది. కనిక హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రకాష్ తో సెటిల్ అయ్యేందుకు ఇష్టపడలేదట. అలాగే ప్రకాష్ ఇక్కడ తన తండ్రి లెగ‌సి కంటిన్యూ చేయాలని.. టాలీవుడ్ లో మంచి దర్శకుడుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలన్న ఆలోచనలతో ఉన్నారు.

ప్రకాష్ హైద‌రాబాద్ వ‌దిలి ముంబై వెళ్లేందుకు ఇష్టపడకపోవడంతో కనిక పంతానికి పోయినట్టు తెలుస్తోంది. ప్రకాష్ బంధువులు, సర్కిల్ అంతా హైదరాబాదులోనే ఉంది. అందుకే కనిక ప్రకాష్ ని వదిలేసి విడాకులకు రెండేళ్ల ముందే ముంబై వెళ్ళిపోయింది. అప్పటినుంచి తన భర్తను పట్టించుకోవడం మానేసింది. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్ చివరకు వారు విడాకులు తీసుకునే వరకు వెళ్ళింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news