Moviesఆ స్టార్ హీరో వల్లే హీరోయిన్ కౌసల్య పెళ్లికి దూరంగా ఉందా...?

ఆ స్టార్ హీరో వల్లే హీరోయిన్ కౌసల్య పెళ్లికి దూరంగా ఉందా…?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ లు పెళ్లికి దూరంగా ఉంటున్నారు. 30 నుండి 40 ఏళ్లు దాటినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. మరికొందరు భామలో డేటింగ్ లో ఉన్నారు. అనుష్క, తమన్నా లాంటి హీరోయిన్లకు ఈ వయసులో కూడా ఆఫర్లు రావడంతో వాళ్లు పెళ్లి అనే పదానికే దూరంగా ఉంటున్నారు. అసలు వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది దేవుడికే తెలియాలి. కానీ ఒకప్పటి హీరోయిన్స్ మాత్రం 30 ఏళ్లు దాటకముందే పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడేవారు. అయినప్పటికీ అప్పటి హీరోయిన్స్ లో కూడా అది కొద్ది మందిని మాత్రమే పెళ్లికి దూరంగా ఉన్నారు.

ఆ లిస్టులో సీనియర్ హీరోయిన్ టబు, నగ్మా లాంటి స్టార్ హీరోయిన్ లు ఉన్నారు. అంతేకాకుండా అదే లిస్టులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ కౌసల్య కూడా ఉన్నారు. కౌసల్య తెలుగులో శ్రీకాంత్ హీరోగా నటించిన “పంచదార చిలక” సినిమాలో హీరోయిన్ గా నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతే కాకుండా చూడ్డానికి హీరోయిన్ లా కాకుండా సహజంగా కనిపిస్తూ అభిమానులను సంపాదించుకున్నారు.

ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా కేవలం తన పాత్రకు….కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే కౌసల్య ఎంపిక చేసుకుని నటించేవారు. అప్పట్లో కౌసల్యకు మహిళా ప్రేక్షకుల నుంచి ఎక్కువగా ఫాలోయింగ్ ఉండేది. ఇదిలా ఉంటే కౌసల్య ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్ జీవితాన్ని గడుపుతున్నారు. దానికి కారణం ఓ మలయాళ స్టార్ హీరో అని మాలీవుడ్ లో టాక్ కూడా ఉంది. కౌసల్య మలయాళం లోనే ఎక్కువ సినిమాలు చేశారు.

ఈ క్రమంలోనే ఆ హీరోతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు …కానీ హీరో కుటుంబ సభ్యులు మాత్రం కౌసల్య ను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు. దాంతో కౌసల్య ఆ హీరోనే తలుచుకుంటూ ఇప్పటికే ఒంటరిగా ఉంటున్నారు. కానీ సినిమాలకు మాత్రం కౌసల్య గుడ్ బై చెప్పలేదు. సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు తల్లి,అక్క ,వదిన ఇలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు వస్తే నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news