Moviesత‌న హిట్ సినిమా పేరునే ఫామ్‌హౌస్‌కు పెట్టుకున్న తార‌క్‌.. ఆ టైటిల్...

త‌న హిట్ సినిమా పేరునే ఫామ్‌హౌస్‌కు పెట్టుకున్న తార‌క్‌.. ఆ టైటిల్ ఇదే..!

మ‌న తెలుగు సినిమా వాళ్ల‌లో చాలా మందికి హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల‌, న‌గ‌ర శివార్ల‌లో ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జ‌ల్లాల్లో ఈ ఫామ్‌హౌస్‌లు ఎక్కువుగా ఉన్నాయి. చాలా మంది రిలాక్స్ కోసం ఈ ఫామ్‌హౌస్‌ల‌కు వెళ్లి కొద్ది రోజులు ఉండి వ‌స్తుంటారు. ఇక క‌రోనా టైంలో చాలా మంది అయితే ఈ ఫామ్‌హౌస్‌ల్లోనే ఉన్నారు. వీకెండ్ అయితే ఈ ఫామ్‌హౌస్‌ల్లో భారీ పార్టీలు న‌డుస్తుంటాయి.

ఇక కొంద‌రు ఆ ఫామ్ హౌస్‌ల్లోనే సేంద్రీయ వ్య‌వ‌సాయం చేస్తూ సొంతంగా కూర‌గాయ‌లు కూడా పండిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే స్టార్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు సైతం న‌గ‌ర శివార్ల‌లోని శంక‌ర్‌ప‌ల్లిలో ఓ ఫామ్‌హౌస్ ఉంది. న‌గ‌ర శివార్ల‌లోని శంక‌ర్‌ప‌ల్లి మండ‌లం గోపాల‌పురం గ్రామంలో ఈ ఫామ్‌హౌస్ ఉంది. గతంలో వ్య‌వ‌సాయ భూమిగా ఉన్న ఈ ప్లేస్‌ను ఎన్టీఆర్ కొని అక్క‌డ ఫామ్ హౌస్ క‌ట్ట‌డంతో పాటు అంద‌మైన తోట‌లు కూడా పెంచారు.

ఈ ఫామ్ హౌస్ విస్తీర్ణం మొత్తం 6.5 ఎక‌రాలు ఉంటుంది. దీనిని ఎన్టీఆర్ త‌న స‌తీమ‌ణి ల‌క్ష్మీప్ర‌ణ‌తికి పుట్టిన రోజు కానుక‌గా ఇచ్చాడ‌ని అంటారు. ఆమె బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ కూడా అక్క‌డే నిర్వ‌హించారు. ఇక ఈ ఫామ్‌హౌస్‌కు ఎన్టీఆర్ త‌న బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా టైటిల‌నే పెట్టుకున్నాడ‌ట‌. ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బృందావ‌నం సినిమా వ‌చ్చి క్లాసిక‌ల్ హిట్‌గా నిలిచింది.

ఈ క్ర‌మంలోనే త‌న ఫామ్‌హౌస్‌కు సైతం బృందావ‌నం పేరు పెట్టుకున్నాడ‌ట‌. ఈ విష‌యం ఇప్పుడు నెట్టింట్లో బాగా వైర‌ల్ అవుతోంది. ఇక ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆరు వ‌రుస హిట్ల‌తో ఫామ్‌లో ఉన్నాడు. రీసెంట్‌గా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఇప్పుడు ఎన్టీఆర్ చేతిలో ప్ర‌శాంత్ నీల్‌, కొర‌టాల శివ సినిమాలు ఉన్నాయి. ఇందులో ముందుగా కొర‌టాల శివ సినిమా సెట్స్ మీద‌కు వెళుతుంది. త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ పాన్ ఇండియా సినిమా ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news