Moviesఆ విష‌యంలో టాలీవుడ్ నెంబ‌ర్ 1 బాల‌య్యే... 2 మ‌హేష్‌బాబు.. మిగిలిన...

ఆ విష‌యంలో టాలీవుడ్ నెంబ‌ర్ 1 బాల‌య్యే… 2 మ‌హేష్‌బాబు.. మిగిలిన హీరోలు కెలుకుడు బాబులే…!

ఎస్ ఓ విష‌యంలో టాలీవుడ్‌లోనే నెంబ‌ర్ 1 హీరో బాల‌య్య‌.. ఆ ఒక్క విష‌యంలో మాత్రం ఆయ‌న‌కు తిరుగు ఉండ‌దు.. ఆయ‌న అంత మంచి మ‌నిషి ఎవ్వ‌రూ ఉండ‌రు. ఇప్పుడు సినిమా రంగంలో చాలా మార్పులు వ‌చ్చాయి. హీరోలు ఓ సారి క‌థ విని ఓకే చేశాక కూడా.. సెట్స్ మీద‌కు వెళ్లిన‌ప్పుడు చాలాసార్లు జోక్యం చేసుకుని ఇష్టం వ‌చ్చిన‌ట్టు క‌థ‌ను అష్ట‌వంక‌ర‌లు తిప్పేస్తూ ఉంటారు. కొంద‌రు హీరోల ఒత్తిడితో ద‌ర్శ‌కులు రేపు షూట్ చేయాల్సిన సీన్‌ను కూడా మార్చేస్తూ ఉంటారు.

ఇటీవ‌ల కాలంలో టాలీవుడ్‌లో అంద‌రు హీరోలు స్క్రిఫ్ట్ లాక్ అయ్యాక కూడా తెగ కెలికేస్తున్నారు. అయితే ఈ విష‌యంలో ఇద్ద‌రు హీరోలు మాత్ర‌మే ద‌ర్శ‌కుల హీరోలుగా మంచి మార్కులు వేయించుకున్నారు. ఓ సారి క‌థ విని ద‌ర్శ‌కుడికి ఓకే చెప్పాక బాల‌య్య అస్స‌లు స్క్రిఫ్ట్‌లో ఏ మాత్రం జోక్యం చేసుకోడు. ఈ విష‌యం ఇండ‌స్ట్రీ మొత్తానికి తెలుసు. ద‌ర్శ‌కుడు ఏది చెపితే అది చేసుకుంటూ పోవ‌డ‌మే..!

సినిమా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా బాల‌య్య ద‌ర్శ‌కుల హీరో. ఈ విష‌యంలో ఆయ‌నే ఇండ‌స్ట్రీ నెంబ‌ర్ వ‌న్‌. ఆయ‌న‌కు సాటి వ‌చ్చే హీరో ఎవ్వ‌రూ లేరు. ఇక స్టార్ హీరోల్లో బాల‌య్య త‌ర్వాత సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు కూడా ద‌ర్శ‌కుల హీరోగా పేరు ఉంది. స్క్రిఫ్ట్ విష‌యంలో సందేహాలు ఉంటే అడ‌గ‌డం మిన‌హా ఆయ‌న కూడా పెద్ద‌గా ద‌ర్శ‌కుల‌ను ఇబ్బంది పెట్ట‌రు.

ఇక ద‌ర్శ‌కుల‌ను బాగా ఇబ్బంది పెడుతూ ముప్పుతిప్ప‌లు పెట్టే హీరోల్లో చాలా మంది మెగా కాంపౌండ్ నుంచే ఉన్నార‌ని ఇండస్ట్రీలో ఎప్ప‌టి నుంచో టాక్ ఉంది. అస‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయితే అప్ప‌ట్లో చాలా సీన్లు, ఫైట్లు ద‌ర్శ‌కుల‌ను ప‌క్క‌న పెట్టేసి ఆయ‌నే తీసేసుకుంటార‌న్న‌ది తెలిసిందే. ప‌వ‌న్ డైరెక్ట్ చేసిన సీన్లు, ఫైట్లు క్లిక్ కావ‌డంతో ఏకంగా మెగాఫోన్ ప‌ట్టి జానీ సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. ఆ త‌ర్వాత అయినా ప‌వ‌న్ ద‌ర్శ‌కుల విధుల్లో జోక్యం చేసుకోవ‌డం మాన‌లేదు.

ఇక ఆచార్య సినిమా మ‌రీ అంత డిజాస్ట‌ర్ అవ్వ‌డానికి కార‌ణం… ద‌ర్శ‌కుడికి సంబంధం లేకుండా ఇష్ట‌మొచ్చ‌న‌ట్టు ఎడాపెడా ప్ర‌తి రోజు సీన్లు మార్చ‌డ‌మే అట‌. ఇక అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున కాస్త బెట‌ర్ అనుకున్నా అఖిల్ సినిమాను కూడా ఇష్టం వ‌చ్చిన‌ట్టు కెల‌క‌డం వ‌ల్లే ప్లాప్ అయ్యింద‌నే వాళ్లూ ఉన్నారు. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా గ‌తంలో ద‌ర్శ‌కుల విధుల్లో జోక్యం చేసుకునేవాడ‌న్న పేరు ఉంది.

అయితే ఇప్పుడు అలాంటి త‌ప్పులు చేయ‌క‌పోవ‌డంతో పాటు ద‌ర్శ‌కుల‌కు పూర్తి ఫ్రీడ‌మ్ ఇవ్వ‌డంతో వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్నాడు. ఇక వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నా స‌క్సెస్‌లు లేని ఓ మాస్ హీరో సైతం ద‌ర్శ‌కుల‌పై ఒత్తిడి చేసి మ‌రీ కెలికేస్తాడ‌నే అంటారు. నేచుర‌ల్ స్టార్ నానికి స్వ‌త‌హాగా డైరెక్ష‌న్ మీద అవ‌గాహ‌న ఉండ‌డంతో నాని కూడా క‌థ‌లో మార్పులు, చేర్పులు చేయాల‌ని ప‌ట్టుబ‌డ‌తార‌ని అంటారు. ఏదేమైనా ద‌ర్శ‌కుల హీరోగా పేరున్న వాళ్ల‌లో బాల‌య్యే నెంబ‌ర్ వ‌న్ హీరో.. త‌ర్వాత మ‌హేష్‌బాబు మాత్ర‌మే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news