Movies"ట్విట్టర్‌లో పిట్టలు రెట్టలు "..డైరక్టర్ మితి మీరిన కామెంట్స్..కొంప ముంచేసాడ్రోయ్..!!

“ట్విట్టర్‌లో పిట్టలు రెట్టలు “..డైరక్టర్ మితి మీరిన కామెంట్స్..కొంప ముంచేసాడ్రోయ్..!!

ఈ మధ్య కాలంలో మనం బాగ గమనించిన్నట్లైతే ..సోషల్ మీడియా జనాల తల రాతను డిసైడ్ చేస్తుంది. మానవాళి సృష్టించిన ఈ సోషల్ మీడియా మనుషుల ప్రాణాలు తీస్తుంది.. మన తల రాతను మార్చేస్తుంది. అంతకన్న దౌర్భాగ్య స్ధితి వేరే ఉంటుందా..?. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ పై సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువుగా ఉంది. ఓ ప్రముఖ సెలబ్రిటి మంచి పని చేస్తే..లేట్ గా వైరల్ అయ్యే న్యూస్..అదే ఓ హీరోయిన్ లవ్ మ్యాటర్..పొట్టి పొట్టి బట్టల ఫోటో షూట్లు మాత్రం సెకన్లల్లో వైరల్ అయిపోతాయి. కారణం ఏంటో ఎవ్వరికి తెలియదు..

అయితే, ఇలాంటి సోషల్ మీడియా పై..మరీ ముఖ్యంగా సినిమా రిలీజ్ అయ్యక ట్వీట్టర్ లో రివ్యూస్ పోస్ట్ చేసే ట్వీట్స్ పై రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా డైరెక్టర్ శరత్ మండవ ఫైర్ అయ్యారు. కోపం వచ్చిందో..లేక తన సినిమా కి ఫ్లాప్ టాక్ ఇస్తారు అని భయపడ్డారో తెలియదు కానీ..కొంచెం టంగ్ స్లిప్ అయ్యి..నోటి దూకుడు ప్రవర్తించాడు అంటున్నారు నెటిజన్లు.

ఈ నెల 29వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరబాద్ లో జరుపుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నాని, బాబీ వంటి వారు ముఖ్య అతిథులుగా వచ్చారు. అందరు బాగా సపోర్ట్ చేసారు ట్రైలర్ కూడా బాగుంది. సినిమా మంచి హిట్ అవుతుంది..హమ్మయ్య మా అన్న కి హిట్ పడబోటుంది అన్న టైంకి డైరెక్టర్ రచ్చ రచ్చ చేసేశారు.

ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ..”దయచేసి ట్వీట్టర్ రివ్యూలు చూసి సినిమాలకి వెళ్లకండి. సినిమా ఫస్ట్ షో పడకముందే రివ్యూలు వచ్చేస్తున్నాయి. అలా నెగిటివ్ కామెంట్స్ కారణంగా…ధియేటర్ కి వెళ్లి సినిమాలు చూడలేకపోతున్నారు జనాలు..మీ వల్ల సినిమా కలెక్షన్ దెబ్బ తింటున్నాయి..”అంటూ చెప్పుకొచ్చారు. అలా మాట్లాడినా ఓకే..ఆయన బాధ ఆయనది అనుకునే వాళ్లం. కానీ ఓ అడుగు ముందుకేసి..”ట్విట్టర్‌లో పిట్టలు రెట్టలు మాత్రమే వేస్తాయి.

వాళ్లెవ్వరూ కూడా మంచి ట్వీట్లు వేయడం లేదు.”..అంటూ చీప్ కామెంట్స్ చేశాడు . అక్కడే మిగతా హీరో అభిమానులకు కాలింది. అంటే సినిమా హిట్ అని ఇచ్చిన రివ్యూలని డబ్బులిచ్చి రాయించారా..? అంటూ మండిపడుతున్నారు. మా హీరోలను పరొక్షంగా కామెంట్స్ చేసినందుకు నీ సినిమా ఫ్లాప్ అవుతుంది..అంటూ శాపనార్ధాలు పెడుతున్నారు. కొందరు అయితే, రవి తేజ సినిమా ఫ్లాప్ అంటూ కూదా ట్రెండ్ చేస్తున్నారు. పాపం, ఫ్రస్ట్రేషన్ లో టంగ్ స్లిప్ అయిన ఆయనకి..సినిమా రిలీజ్ అవ్వకముందే బొమ్మ చూపించేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news