Moviesఎన్టీఆర్ - కొర‌టాల 5 అదిరిపోయే అప్‌డేట్లు ఇవే...!

ఎన్టీఆర్ – కొర‌టాల 5 అదిరిపోయే అప్‌డేట్లు ఇవే…!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ RRR సినిమా కోసం త‌న కేరీర్ లో విలువైన మూడు సంవ‌త్స‌రాలు స్పెండ్ చేశాడు. ఈ సంవ‌త్స‌రం మార్చ్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌టంతో పాటు ఎన్టీఆర్ కూ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ RRR సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నా త‌న అభిమానుల‌ను మాత్రం చాలా నిరుత్సాహ‌ప‌రిచాడ‌ని
చెప్పాలి. ఎప్పుడో 2018లో వ‌చ్చిన అర‌వింద స‌మేత సినిమా త‌రువాత మూడేళ్ల‌ పాటు ఎన్టీఆర్ మ‌రే సినిమాలోనూ న‌టించ‌లేదు. RRRలో ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించిన రామ్‌చ‌ర‌ణ్ వెంట‌నే త‌న నెక్ట్స్‌ ప్రాజెక్టులో బిజీ అయిపోయాడు. ఏకంగా శంక‌ర్ లాంటి టాప్ డైర‌క్ట‌ర్‌ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు.

మ‌ధ్య‌లో త‌న తండ్రి చిరంజీవితో క‌లిసి ఆచార్య‌లో కీల‌క‌పాత్ర‌లో క‌నిపించాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇప్ప‌టికి త‌న త‌ర్వాత‌ సినిమాను మొద‌లు పెట్ట‌లేదు. ఎన్టీఆర్ వ‌రుస‌గ కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్‌నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రెండు భారీ మాల్టీస్టార‌ర్ సినిమాల‌ను లైనులో పెట్టినా అవి ఇంకా మొద‌లు కాలేదు. గ‌త మూడు, నాలుగు నెల‌ల నుంచి అదిగో ఇదిగో అంటున్నా కొర‌టాల శివ సినిమాను ఇంకా మొద‌లు పెట్ట‌లేదు. మ‌రో వైపు ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ సినిమా ఎప్పుడు ? ప్రారంభం అవుతుంది.. రెగ్యుల‌ర్ అప్‌డేట్స్ ఎప్పుడు వ‌స్తాయా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తూన్నారు.

ఆచార్య సినిమా ప్లాప్ అవ‌డంతో కొర‌టాల ఆ సినిమా లెక్క‌లు ముగించే ప‌నిలో ఉన్నారు. ఆ పని పూర్తి అయిన వెంట‌నే ఎన్టీఆర్ సినిమాను ప్రారంభిస్తారు. ఈ క్ర‌మంలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ గురించి ఐదు అదిరిపోయే అప్‌డేట్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. సెప్టెంబ‌ర్ రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షుటింగ్ ప్రారంభిస్తారు. అలాగే రెండో అప్‌డేట్ ఎంటంటే జూబ్లిహిల్స్ లో ఈ సినిమాలో కీల‌క సన్నివేశాల‌ను షూట్ చేసేందుకు ప్ర‌త్యేకంగా సెట్ కూడా పూర్తి చేశార‌ట.

అలాగే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ చాలా స‌రికొత్త‌గా ఉండ‌బోతుంది అట. ఇప్ప‌టికే త‌న మేకోవ‌ర్ ను సైతం కొత్త‌గా మార్చుకున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇందుకోస‌మే ఎన్టీఆర్ భారీ వ‌ర్క‌వుట్లు చేస్తూ బ‌రువు త‌గ్గుతున్న ఫొటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇక నాలుగో అప్‌డేట్ ఎంటంటే హీరోయిన్‌గా కొంత మంది పేర్లు వినిపించినా బాలీవుడ్ భామ‌నే తీసుకోవాల‌ని డైర‌క్ట‌ర్ కొర‌టాల శివ ఫిక్స్ అయ్యాడ‌ట‌.

ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్ లో తీస్తుండ‌డంతో నార్త్ ఇండియాలో క్రేజ్ ఉండేందుకు నార్త్ హీరోయిన్ నే తీసుకోవ‌టం దాద‌పు ఖ‌రారైంది. అలాగే ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగినా ఇంకా షుటింగ్ ప్రారంభం కాక‌పోవ‌డంతో మ‌హాశివ‌రాత్రి కానుక‌గా థియేట‌ర్ల‌లోకి దింపేలా ప్ర‌ణాళిక‌ జ‌రుగుతుంది. ఒక‌సారి సినిమా సెట్స్ దీద‌కు వెళ్లిపోతే ఇక ఎన్టీఆర్ అభిమానుల‌కు వ‌రుస అప్‌డేట్స్‌తో పండుగే అని చెప్పుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news