Moviesబాలీవుడ్‌లో బిగ్‌బ్రేక‌ప్‌... టైగ‌ర్ ష్రాఫ్‌, దిశాప‌టానీ విడిపోవ‌డానికి ఇంత పెద్ద‌గొడ‌వ జ‌రిగిందా..!

బాలీవుడ్‌లో బిగ్‌బ్రేక‌ప్‌… టైగ‌ర్ ష్రాఫ్‌, దిశాప‌టానీ విడిపోవ‌డానికి ఇంత పెద్ద‌గొడ‌వ జ‌రిగిందా..!

బాలీవుడ్‌లో చాలా మంది కుర్ర హీరోయిన్లు, హీరోలు ప్రేమ‌లో ప‌డి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ర‌ణ‌వీర్‌సింగ్ – దీపికా ప‌డుకొనే, ర‌ణ‌బీర్‌- ఆలియాభ‌ట్‌, క‌త్రినాకైఫ్ – విక్కీకౌశ‌ల్ ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు. ఈ కోవ‌లోనే మ‌రో యంగ్ హీరో, హీరోయిన్లుగా ఉన్న టైగ‌ర్ ష్రాఫ్, దిశా ప‌టానీ కూడా గత ఐదారేళ్లుగా ప్రేమ‌ప‌క్షుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

త‌మ ప్రేమాయ‌ణం విష‌యాలు దాచుకోవ‌డానికి కూడా వీరు ఏ మాత్రం వెనుకాడ‌కుండా వ‌చ్చేశారు. ఒకే రిసార్టుల్లో స్టే చేసిన‌ప్పుడు కూడా ఫొటోలు షేర్ చేసేవారు. త‌మ ప్రేమ‌క‌థ గురించి సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక లీక్ ఇచ్చేందుకే చూసేవారు. ఈ వ‌య‌స్సులో ఇన్నాళ్ల పాటు ప్రేమ‌లో ఉండ‌డం, జంట‌గా తిర‌గ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

అయితే తాజాగా వీరి బ్రేక‌ప్ వార్త ఇప్పుడు బాలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారింది. ఈ ప్రేమ‌ప‌క్షులు విడిపోయి చెరోదారి చూసుకున్నారు. వీరిద్ద‌రి ప్రేమ‌పై టైగ‌ర్ తండ్రి, సీనియ‌ర్ న‌టుడు జాకీష్రాప్ కూడా స్పందించారు. వీరిద్ద‌రు క‌లిసి తిర‌గ‌డం తాను కూడా చూశాన‌ని.. అయితే త‌న కొడుకు ప్రేమ వ్య‌వ‌హారాల్లో తాను త‌ల‌దూర్చ‌న‌ని స్ప‌ష్టం చేశారు. ఇక వారు ఇప్పుడు విడిపోయారా ? లేదా ? అన్న‌దానిపై మాత్రం ఆయ‌న స్పందించ‌లేదు.

ఇక వీరిద్ద‌రు విడిపోవ‌డానికి పెళ్లి విష‌యంలో పెద్ద గొడ‌వ జ‌ర‌గ‌డ‌మే కార‌ణ‌మ‌ని స‌మాచారం. త‌న తోటి యంగ్ హీరోయిన్లు అంద‌రూ కూడా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. ఇటు సినిమాలు కూడా చేస్తున్నారు. దిశా కూడా పెళ్లి చేసుకుందామ‌ని టైగ‌ర్‌పై ఒత్తిడి చేసింద‌ట‌. అయితే ఇందుకు టైగ‌ర్ ఒప్పుకోక‌పోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద గొడవ జ‌రిగి విడిపోయిన‌ట్టుగా తెలుస్తోంది.

త‌మ తోటి న‌టీన‌టులు పెళ్లి చేసుకుని.. కూడా ఇటు సినిమాల్లో రాణిస్తూ మోస్ట్ పాపుల‌ర్ క‌ఫుల్‌గా ఉంటున్నారు. దిశ ఆలోచ‌న‌లో కూడా ఆ దిశ‌గానే ఉన్నాయ‌ట‌. అయితే ఇందుకు టైగ‌ర్ ఒప్పుకోక‌పోవ‌డంతో వీరి మ‌ధ్య స్ప‌ర్థ‌లు పెరిగి.. చివ‌ర‌కు వీరు బ్రేక‌ప్ చెప్పుకునే వ‌ర‌కు వ‌చ్చేశాయంటున్నారు. ఏదేమైనా బాలీవుడ్ బ్రేక‌ప్‌ల ప‌రంప‌ర‌లో మ‌రో బ్రేక‌ప్ వ‌చ్చి చేరింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news