MoviesNTR30: సూపర్ ఉమెన్ ని రంగంలోకి దించుతున్న కొరటాల..ఫ్యాన్స్ లో కొత్త...

NTR30: సూపర్ ఉమెన్ ని రంగంలోకి దించుతున్న కొరటాల..ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం ?

తాను ఒకటి తలిస్తే దైవం మరోకటి తలచింది అన్నట్లు..పాపం, కొరటాల శివ లైఫ్ లో ఊహించని విధంగా ఫస్ట్ టైం ఫ్లాప్ పడింది. అదికూడా మెగా హీరో ల సినిమా తో ..దీంతో ఇండస్ట్రీలో కొరటాల శివ పై దారుణంగ ట్రోల్స్ వస్తున్నాయి. మనకు తెలిసిందే..కొరటాల శివ తెరకెక్కించిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయం అందుకున్నాయి. ఢిఫరెంట్ విధానంలో సినిమాలను డైరెక్ట్ చేయడం కొరటాల స్పెషాలిటీ. అందుకే ఆయన తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద హిట్ అవుతూ వచ్చాయి.

కానీ, మెగా హీరోలతో డైరెక్ట్ చేసిన “ఆచార్య” మాత్రం బెడిసికొట్టింది. కధ లో పాయింట్ లేకపోవడం..అది మెగా హీరోలకి సెట్ కాకపోవడంతో సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో కెరీర్ లో ఫస్ట్ ఫ్లాప్ ను రుచి చూశాడు కొరటాల శివ. అయితే, ఇప్పుడు కొరటాల ఆశల్నీ కూడా..తారక్ పైనే పెట్టుకున్నాడు. NTR తన నెక్స్ట్ సినిమా కొరటాల తోనే తీయ్యబోతున్నాడని..తెలిసిందే. బర్తడే సంధర్భంగా..కొరటాల మూవీ కి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ రీలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమా లో తారక్ మాస్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో తారక్ మనకు ఓ ఢిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారట. అయితే, ఇప్పటి వరకు..ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది తెలియలేదు. తెర పైకి చాలా మంది హీరోయిన్స్ పేర్లు వస్తున్నప్పటికి..ఇంకా అఫిషీయల్ గా అయితే, బయటకి రాలేదు. కాగా, ఈ సినిమా కు సంబంధించి ఓ క్రేజీ రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో తారక్ కు అత్తగా నదియా నటించబోతుందట. ఇప్పటికే “అత్తారింటికి దారేది, అ ఆ” సినిమాలో అత్త పాత్రల్లో కనిపించి సూపర్ స్పేషల్ ఉమెన్ గా పేరు సంపాదించుకున్న ఈమె ..తారక్ సినిమాలో అత్తగా కనిపిస్తుంది అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. దీంతో సినిమా పై మంచి బజ్ ఏర్పడింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news