Moviesఓటిటిలో నయనతార పెళ్లి వేడుక..పెళ్లిని కూడా బిజినెస్ చేసేసారు కదరా నాయనా..?

ఓటిటిలో నయనతార పెళ్లి వేడుక..పెళ్లిని కూడా బిజినెస్ చేసేసారు కదరా నాయనా..?

సౌత్ ఇండియ‌న్ స్టార్‌ హీరోయిన్ నయనతార..అబ్బో ఈ అమ్మడు గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. అలాంటి స్దానాని సంపాదించుకుంది ఈ బ్యూటీ. నయన్ వయసు నాలుగు పదులు దాటుతున్నా ఇప్పటికీ వన్నె తగ్గని అందం తన సొంతం. ఇంకా చెప్పాలంటే వయసు పెరుగుతున్న కొద్ది..అందం కూడా పెంచుకుంటుంది. తన అందం, అభినయంతో తెలుగు, తమిళ రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా ఓ బడా హీరో తో సినిమాకి సంతకం చేసిన్నట్లు టాక్ వినిపిస్తుంది.

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా అంచెలంచలుగా ఎదుగుతూ వస్తున్న భామ నయనతార కోలీవుడ్ లో ఆమె సినిమా అంటే అక్కడ స్టర్ హీరోలు కూడా భయపడే పరిస్థితి ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా..కంటెంట్ ఉన్న సినిమాలతో తమిళనాట సంచలన విజయాలను అందుకుంటున్న నయనతార ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉందని చెప్పొచ్చు. ఏ హీరోయిన్ కూడా చేయని ప్రయోగాలతో..సరికొత్త కధలను చూస్ చేసుకుంటూ.. నయన్ సినిమాలు చేస్తుంది. ఇక తెలుగులో కూడా సీనియర్ స్టార్స్ కు ఆమె బెటర్ ఆప్షన్ అయ్యింది.

కాగా, గత కొన్ని సంవత్సరాలుగా లేడీ సూపర్‌ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే వీళ్లు పబ్లిక్ గానే చేతిలో చెయ్యి వేసుకుని తిరిగేస్తున్నారు. అయితే , ఈ జంట ఎట్టకేల్కౌ పెళ్ళి పీఠలు ఎక్కబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 9న హిందూ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో మ‌హాబ‌లిపురంలోని ఓ ఫైవ్ స్టార్ హోట‌ల్లో విఘ్నేష్ శివ‌న్, న‌య‌న తారల‌ పెళ్లి జ‌రుగ‌నుంది. వీళ్ల పెళ్లికి సంబంధించిన పెళ్లి కార్డులు కూదా పంచేశారు.

ఈ క్రమంలోనే..తమిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను పెళ్ళికి ఆహ్వానించారు…న‌య‌న‌తార, విఘ్నేష్ శివ‌న్‌. అంతేకాదు కోలీవుడ్ బడా స్టార్స్ కూడా పెళ్లి హాజరు కాబొతున్నట్లు తెలుస్తుంది. అయితే, వీళ్ళ పెళ్లి వేడుకను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారని తాక్ వినిపిస్తుంది. కాగా, లైవ్ ఇస్తారా లేక మొత్తం షూట్ చేసి సినిమాలాగా ప్రెజెంట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీని పై నెటిజన్స్ మరోలా స్పందిస్తున్నారు. పెళ్ళిని కూడా పబ్లిసిటీ గా మార్చేసి..బిజినేస్ చేస్తున్నారు కదరా నాయనా అంటూ మండిపదుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news