Movies' బాల‌య్య అఖండ 2 ' ప్లాన్స్‌కు అప్పుడే ముహూర్తం పెట్టేశాడా...!

‘ బాల‌య్య అఖండ 2 ‘ ప్లాన్స్‌కు అప్పుడే ముహూర్తం పెట్టేశాడా…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ కెరీర్‌ను ఆరు ప‌దుల వ‌య‌స్సులో కూడా లేపి టాలీవుడ్ శిఖ‌రాగ్రాన కూర్చోపెట్టిన సినిమా అఖండ‌. అస‌లు అఖండ సినిమా క‌రోనా త‌ర్వాత టాలీవుడ్‌లో అన్ని రంగాల‌కు ఊపిరిలూదింది. అఖండ సినిమా క‌మర్షియ‌ల్ ప‌రంగా.. వ‌సూళ్ల ప‌రంగా, లాభాల ప‌రంగా చూస్తే బాల‌య్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌. ఈ రోజుల్లో 2వ వారం పోస్ట‌ర్లు క‌రువు అవుతుంటే అఖండ ఏకంగా డైరెక్టుగా 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

ఇక అఖండ రిలీజ్ అయ్యాక వంద రోజులు పూర్త‌య్యే వ‌ర‌కు పెద్ద పండ‌గ వాతావ‌ర‌ణ‌మే న‌డిచింది. ఇక అఖండ రిలీజ్ అయ్యాక బోయ‌పాటి క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. బోయ‌పాటి కూడా తాను త్వ‌ర‌లోనే అఖండ 2 చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. బోయ‌పాటి ఆ ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టి నుంచి అఖండ 2 ఎప్పుడు ఉంటుందా ? అని నంద‌మూరి అభిమానులు ఆస‌క్తితోనే ఉన్నారు.

అస‌లు అఖండలో అఘోరా పాత్ర చూసిన వాళ్లు ఈ పాత్ర‌ను బాల‌య్య మాత్ర‌మే చేయ‌గ‌ల‌డు.. ఇంకెవ్వ‌రు చేయ‌లేరని ఘంటాప‌థంగా చెప్పేశారు. బాల‌య్య సైతం అఖండ పాత్ర‌పై మ‌న‌సు ప‌డ‌డంతో పాటు అఖండ 2 ఉంటుంద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. అయితే ఈ సీక్వెల్ అనేది అఖండ సినిమాలో పాత్ర‌లు తీసుకుని మ‌రో కొత్త క‌థ‌తోనే చేస్తార‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం బాల‌య్య మ‌లినేని గోపీ ద‌ర్శ‌క‌త్వంలో 107వ సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత 108వ సినిమా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఉండ‌నుంది. ఆ త‌ర్వాత బోయ‌పాటి శ్రీనుతోనే బాల‌య్య 109వ సినిమా ఉండ‌నుంది. ఈ సినిమాయే అఖండ 2 అవుతుందంటున్నారు. అంటే 2024 ఎన్నిక‌ల‌కు ఒక‌టి, రెండు నెల‌ల ముందుగా అఖండ 2 రిలీజ్ అయ్యే ప్లానింగ్ చేస్తున్నార‌ట‌.

2014 ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన లెజెండ్ సినిమా ఆ ఎన్నిక‌ల్లో పార్టీ కేడ‌ర్‌కు మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఇప్పుడు 2024 ఎన్నిక‌ల‌కు ముందు కూడా అఖండ 2 సినిమాతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడ‌ర్‌కు బూస్టింగ్ ఇచ్చేలా అఖండ 2 ప్లాన్స్ అయితే ఉన్నాయంటున్నారు. అలాగే ఇటు బాల‌య్య‌కు కూడా ఈ సినిమా మంచి పొలిటిక‌ల్గా ఉప‌యోగ‌ప‌డేలా ఉంటుందంటున్నారు.

Latest news