Movies' వాల్తేరు వీర‌య్య‌ ' లో ర‌వితేజ పాత్ర చనిపోవ‌డానికి చిరుకు...

‘ వాల్తేరు వీర‌య్య‌ ‘ లో ర‌వితేజ పాత్ర చనిపోవ‌డానికి చిరుకు లింక్ ఏంటి…!

మెగాస్టార్ చిరంజీవి కుర్రాళ్ల‌కు పోటీ ఇస్తూ వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ఆచార్య సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిరు ఆగ‌స్టు నెలలో గాడ్‌ఫాద‌ర్ సినిమాతో మ‌రోసారి త‌క్కువ టైంలోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. మ‌ళ‌యాళంలో హిట్ అయిన లూసీఫ‌ర్ సినిమాకు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాకు హ‌నుమాన్ జంక్ష‌న్ ఫేం మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

న‌య‌న‌తార హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమా త‌ర్వాత వ‌చ్చే సంక్రాంతికే మోహ‌ర్ ర‌మేష్ డైరెక్ట్ చేస్తోన్న భోళా శంక‌ర్ వ‌స్తోంది. కోలీవుడ్‌లో అజిత్ హీరోగా వ‌చ్చిన వేదాళం సినిమాకు రీమేక్‌గా భోళా శంక‌ర్ వ‌స్తోంది. త‌మ‌న్నా హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమాలో చిరుకు చెల్లిగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. హాట్ యాంక‌ర్ శ్రీముఖి కూడా గెస్ట్‌గా న‌టిస్తోంది.

ఈ రెండు సినిమాల‌తో పాటు యంగ్ డైరెక్టర్ కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా వ‌చ్చే వేస‌విలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ జ‌రుగుతోంది. ఈ సినిమాలో చిరుతో పాటు మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించబోతోన్న సంగ‌తి తెలిసిందే. ర‌వితేజ పాత్ర‌కు సంబంధించి కొద్ది రోజులుగా ర‌క‌ర‌కాల అప్‌డేట్లు వ‌స్తున్నాయి.

ర‌వితేజ పాత్ర‌కు సంబంధించి ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ వ‌ర్గాల ద్వారా ఓ అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది. ఇంట‌ర్వెల్ సీక్వెన్స్‌లో ర‌వితేజ క‌నిపిస్తాడ‌ట‌. ర‌వితేజ పాత్ర చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంద‌ని.. ఇది సినిమాను మ‌లుపు తిప్పే పాత్ర అని అంటున్నారు. ర‌వితేజ పాత్ర చ‌నిపోతుంద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ పాత్ర చ‌నిపోయాకే చిరులో మార్పు వ‌స్తుంద‌ట‌.

ర‌వితేజ చిరు సినిమాలో ఉంటే అది ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్‌. అయితే ఆ పాత్ర చ‌నిపోతుంద‌న్న వార్త‌లు మాత్రం కొంద‌రిని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక వాల్తేరు వీర‌య్య సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతుంది. చిరు – శృతి హాసన్ జోడీ చూసేందుకే ర‌చ్చ‌గా ఉంటుంద‌న్న‌ది తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news