Moviesబాల‌య్య - మ‌లినేని గోపీచంద్ సినిమా టైటిల్ ఇదే.. అఖండ సెంటిమెంట్...

బాల‌య్య – మ‌లినేని గోపీచంద్ సినిమా టైటిల్ ఇదే.. అఖండ సెంటిమెంట్ ఫాలో అయ్యారే…!

క్రాక్ సినిమాతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ అందుకున్న గోపీచంద్ మలినేని… ఇటు అఖండ విజయంతో కెరీర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన నంద‌మూరి బాల‌కృష్ణ కాంబినేషన్లో నెక్ట్స్ సినిమా రెడీ అవుతోంది. మైత్రీ మూవీస్ లాంటి పెద్ద బ్యాన‌ర్ ఈ సినిమాను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో శృతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇక కోలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అఖండ వ‌ర‌ల్డ్ వైడ్‌గా అన్ని విధాలుగా రు. 200 కోట్లు కొల్ల‌గొట్ట‌డంతో ఈ సినిమాపై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. బాల‌య్య‌కు డ‌బుల్ రోల్లో న‌టిస్తోన్న ఈ సినిమాలో క‌న్న‌డ హీరో దునియా విజ‌య్ విల‌న్గా న‌టిస్తున్నాడు. ముస‌ళ్ల‌మ‌డుగు ప్ర‌తాప్‌రెడ్డి అన్న పాత్ర‌లో రిలీజ్ అయిన విజ‌య్ లుక్ చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా క‌నిపిస్తోంది.

ఇక ఈ సినిమా టైటిల్‌పై ముందు నుంచి ర‌క‌ర‌కాల వార్త‌లు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు అన్న గారు అన్న టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు ఈ సినిమా యూనిట్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా క‌థ‌కు త‌గిన‌ట్టుగా ఈ టైటిల్ పెట్టారా ? లేదా ? బాల‌య్య‌ను ఎక్కువ మంది అన్న పిలుస్తూ ఉంటార‌ట‌. ఆ కోణంలో ఈ టైటిల్ ఆలోచ‌న చేస్తున్నారా ? లేదా ? బాల‌య్య తండ్రి ఎన్టీఆర్‌ను చాలా మంది అన్న గారు అని పిలుస్తూ ఉంటారు. ఈ సెంటిమెంట్ క‌లిసి వ‌చ్చేలా ఆ టైటిల్ అనుకుంటున్నారా ? అన్న‌ది చూడాలి.

ఇక బాల‌య్య లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అఖండ సినిమా టైటిల్‌ అ అక్ష‌రంతో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ క‌లిసి వ‌చ్చేలా అ అక్ష‌రంతో మొద‌ల‌య్యే విధంగా అన్నగారు టైటిల్ పెడుతున్నారా ? అన్న చ‌ర్చ నెటిజ‌న్ల‌లో కూడా జ‌రుగుతోంది. ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్ టాక్ ప్ర‌కారం ఈ సినిమా బాగా వ‌చ్చింద‌ని అంటున్నారు. మ‌లినేని గోపీచంద్ బాల‌య్య అభిమానుల‌కు మాత్ర‌మే కాకుండా మాస్ అభిమానుల‌కు అదిరిపోయే ప‌వ‌ర్ ఫుల్ ప్యాక్డ్ సినిమా ఇవ్వ‌బోతున్నాడ‌ట‌.

మ‌లినేని గోపీచంద్ సినిమాను ద‌స‌రాకు రిలీజ్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా అనంత‌రం బాల‌య్య అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో న‌టించ‌నున్నారు. ఈ సినిమా క‌థ‌పై క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నట్టు అనిల్ రావిపూడి ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news