Moviesవావ్: మారుతి -ప్రభాస్ స్టోరీ లైన్ విన్నారా..మైండ్ బ్లోయింగ్..!!

వావ్: మారుతి -ప్రభాస్ స్టోరీ లైన్ విన్నారా..మైండ్ బ్లోయింగ్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస సినిమాలకు కమిట్ అవుతూ..ఏ హీరో తీసుకోని అటువంటి రెమ్యూనరేషన్ అందుకుంటూ..టాప్ ప్లేస్ లో ఉన్నాడు. రీసెంట్ గా ఆయన నటించిన రాధే శ్యామ్ బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టినా..ఆయన క్రేజ్ రేంజ్ మాత్రం అస్సలు తగ్గలెదు. అదే స్పీడ్ తో..అదే హార్డ్ వర్క్ తో తన సినిమాల పై నమ్మకం ఉంచి..ప్రోసీడ్ అవుతున్నాడు ఈ రెబల్ హీరో. అయితే, ప్రభాస్ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నా..అందరి కళ్ళు..ఓ సినిమా పై నే ఉన్నాయి.

భారీ బడ్జెట్ లతో..కోట్లకి కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుని సినిమాలు చేసే ఈ హీరో..చిన్న డైరెక్టర్ మారుతి తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడని వారత్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఎవ్వరు ఊహించని విధంగా బడా హీరో ప్రభాస్ కామెడీ డైరెక్టర్ మారుతికి అవకాశం ఇవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం గా మారింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ..బ్యాక్ గ్రౌడ్ లో పనులన్ని చకచకా జరిగిపోతున్నాయట. ఇప్పటికే పోస్ట్ ప్రోడక్షన్స్ పనులు కంప్లీట్ చేసిన..టీం..త్వరలో నే ఈ సినిమాను సెట్స్ అపి తీసుకెళ్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

డివివి దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని..అందులో మాళ‌వికా మోహ‌న్ మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుందని సమాచారం. ఇక మొద‌టి షెడ్యుల్‌లో ప్ర‌భాస్‌, మ‌ళ‌వికా మ‌ధ్య స‌న్నివేశాలు తెర‌కెక్క‌నున్న‌ట్లుఓ వార్త టాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ సినిమా కి మెయిన్ స్టోరీ లైన్ ఓ యంగ్ కుర్రాడిని ముగ్గురు అమ్మాయిలు ఇష్టపడితే .. ఆ అబ్బాయికి ముగ్గురు అమ్మాయిలు నచ్చితే.. కానీ, తనకు ఉన్న అది పెద్ద ప్రాబ్లమ్ చెప్పాక ముగ్గురిలో ఎవ్వరు తనని పెళ్లి చేసుకుంటాడు. షాకింగ్ ట్వీస్ట్ ఏంటంటే.. అస్సలు ప్రభాస్ మనిషి కాదు.. ఓ ఆత్మ..కేవలం ఆ ముగ్గురుకే ఎందుకు కనిపిస్తుంది..అదే సినిమా స్టోరీ అంటూ..ఓ సూప‌ర్ నాచ్యుర‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఆగ‌స్టులో షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తుంది.దీని కోసం ఓ భారీ సెట్ కూడా రెడీ చేశారు. ఔట్ డోర్ షూటింగ్స్ లేకుండానే మారుతి క‌థ‌ను సిద్ధం చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news