Moviesజేడీ భార్య అనుకృతి, శ్రీహ‌రి భార్య డిస్కోశాంతికి ఉన్న లింక్ ఇదే...!

జేడీ భార్య అనుకృతి, శ్రీహ‌రి భార్య డిస్కోశాంతికి ఉన్న లింక్ ఇదే…!

రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి… రెండు ద‌శాబ్దాల క్రితం క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా… విల‌న్‌గా.. హీరోగా ఇలా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. శ్రీహ‌రి విల‌న్‌గా కెరీర్ స్టార్ట్ చేసినా త‌ర్వాత హీరోగా మారి వ‌రుస హిట్ల‌తో దూసుకుపోయాడు. ఒకానొక టైంలో శ్రీహ‌రికి వ‌రుస హిట్లు ప‌డ‌డంతో టాలీవుడ్ స్టార్ హీరోలే షేక్ అయ్యారు. శ్రీహ‌రి కెరీర్ బాగున్న‌ప్పుడే ఐటెం సాంగ్‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన డిస్కోశాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్ప‌టికే డిస్కోశాంతి పాపుల‌ర్ ఐటెం గ‌ర్ల్‌.

మెగాస్టార్ చిరంజీవి ఘ‌రానా మొగుడు సినిమాలో బంగారు కోడిపెట్ట పాట‌కు ఆమె వేసిన స్టెప్పుల‌కు నాటి తెలుగు కుర్ర‌కారు ఊగిపోయింది. ఆ టైంలోనే శ్రీహరితో ఆమె ప్రేమ‌లో ప‌డ‌డంతో పెళ్లి చేసుకున్నారు. అయితే చిన్న వ‌య‌స్సులోనే శ్రీహ‌రి చనిపోవ‌డం మాత్రం అంద‌రిని క‌లిచి వేసింది. ఇక మ‌రో న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ ముందు భార్య లలిత కుమారి, శ్రీహ‌రి భార్య డిస్కోశాంతి ఇద్ద‌రూ స్వ‌యానా అక్కాచెల్లెళ్లు కావ‌డం విశేషం.

ఇక రాంగోపాల్ వ‌ర్మ సినిమాల్లో విల‌న్‌గా మెరిసిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి ఆ త‌ర్వాత హీరోగా మారి కొన్ని సినిమాలు కూడా చేశాడు. అనగనగా ఒక రోజు, ప్రేమకు వేళాయెరా, బొంబాయి ప్రియుడు వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారి కూడా కొన్ని సినిమాలు చేశాడు. అయితే 40 + ఏజ్ వ‌చ్చే వ‌ర‌కు జేడీ చ‌క్ర‌వ‌ర్తికి పెళ్లి కాలేదు.

చివ‌ర‌కు నాలుగున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో ఐటెం సాంగ్‌ల భామ అనుకృతి శర్మను ప్రేమించి పెళ్లాడాడు.
అయితే గ‌త కొద్ది నెల‌లుగా అనుకృతి – జేడీ చ‌క్ర‌వ‌ర్తి దంప‌తుల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వేర్వేరుగా ఉంటున్నార‌న్న ప్ర‌చారం అయితే జ‌రుగుతోంది. మ‌రి ఇందులో వాస్త‌వాలు ఏంటో బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఏదేమైనా డిస్కోశాంతి, అనుకృతి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, విల‌న్‌గా చేసి.. త‌ర్వాత హీరోలు అయిన వారిని ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో ఐటెం గ‌ర్ల్‌కు మాంచి డిమాండ్ ఉండేది. అయితే ఇప్పుడు హీరోయిన్ల‌కే ఎక్కువ రెమ్యున‌రేష‌న్లు ఇస్తుండ‌డంతో వారు కూడా ఐటెం సాంగ్‌లు చేసేస్తున్నారు. దీంతో ఐటెం గ‌ర్ల్‌కు ప‌ని లేకుండా పోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news